Baby Movie OTT Release Date Delay Due To This Reason, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Baby Movie OTT Release Delay: 'బేబీ' మరింత లేట్.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే?

Published Sun, Jul 23 2023 6:58 PM | Last Updated on Mon, Jul 24 2023 10:38 AM

Baby Movie OTT Release Date Delay - Sakshi

పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'బేబీ' సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 9 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే మూడు-నాలుగు రెట్ల లాభాలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 'బేబీ' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. అనుకున్న సమయం కంటే ఓటీటీలోకి ఆలస్యంగా రానుందట.

(ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!)

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాను ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తీశారు. ముగ్గురికి ముగ్గురు కూడా అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అయితే మూవీని మరో లెవల్ కి తీసుకెళ్లింది. దర్శకుడు ప్రతిభని కూడా కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలా అన్ని అంశాలు 'బేబీ'కి కలిసొచ్చాయి.

రిలీజ్‌కి ముందే 'బేబీ' డిజిటల్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. 4-5 వారాల విరామం తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే థియేటర్లలో వస్తున్న స్పందన చూసి, ఆ నిర్ణయంలో మార్పు జరిగిందని టాక్. కాస్త ఆలస్యంగా అంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరులో తొలివారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement