ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి తన యాక్టింగ్‌తో కుర్రాళ్ల గుండెలపై బలంగానే కొట్టింది. ఓ రకంగా యూత్ మదిలో వైష్ణవిగా ఎప్పటికీ చెరగిన ముద్ర వేసిందని చెప్పవచ్చు. తాజాగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవం డి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ)
బేబీ సినిమా చూసిన ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తే.. ఈ సినిమా తీసుకున్న బయ్యర్లంతా నవ్వుతూ వచ్చారని ఆయన అన్నారు. సినిమా నిడివి ఎక్కువుగా ఉందని మొదట్లో భావించినా ఆడియన్స్ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి కథలో బలాన్ని చూశారని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. కథలోని పాత్రల భావోద్వేగాలు అర్థం అయ్యేలా చెప్పాలనే నిడివి విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు.
బేబి యూనిట్‌ను నమ్మి ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు ఈ సినిమాకు కమిట్ అయ్యారు. వారు ఈ సినిమా పూర్తి అయ్యే వరకు మరో చిత్రాన్ని చేయకుండా ఉండిపోయారని ఆయన తెలిపారు. సినిమా చూసిన వారు వైష్ణవిని తిడుతున్నారు. నిజానికి వైష్ణవి చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో అది క్యారెక్టర్ మాత్రమేనని గ్రహించాలని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం తను రెండేళ్లు కష్టపడింది. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే అయినా సినిమాపై ప్యాషన్‌తో పనిచేసిందని నిర్మాత ఎస్కేఎన్ పేర్కొన్నారు. కథ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది కాబట్టే వైష్ణవి అనే పాత్రను మాత్రమే తిడుతున్నారని అలాంటివి పట్టించుకోకూడదని ఆయన వైష్ణవితో చెప్పారు.
(ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?)
Comments
Please login to add a commentAdd a comment