Youth Creates Funny Memes On Anand Deverakonda And Vaishnavi Chaitanya Baby Movie, Check Inside - Sakshi
Sakshi News home page

Funny Memes On Baby Movie: 'బేబీ' సినిమాపై మీమ్స్‌.. ఈ రెండు మీమ్స్‌ అదిరిపోతాయ్‌

Published Sun, Jul 16 2023 4:50 PM | Last Updated on Sun, Jul 16 2023 5:14 PM

Baby Movie Youth Create Funny Memes Viral - Sakshi

'మొద‌టి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. మ‌న‌సు పొర‌ల్లో శాశ్వతంగా స‌మాధి చేయ‌బ‌డి ఉంటుంది' అని 'బేబీ' సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ ముందే చెప్పాడు. అలాగే ఈ కథను కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు జులై 14న విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే బేబీ కథ యూత్‌ గుండెల్ని బలంగా తాకింది.

ఇందులో ఆనంద్‌ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకుపోయారని చెప్పవచ్చు. 'బేబీ' క‌థ‌లో మాధుర్యంతో పాటు విషాదం కూడా ఉంది. హృద‌య కాలేయం లాంటి కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌లో ఫీల్ గుడ్‌, ఎమోష‌న‌ల్ ట‌చ్ ఉంద‌ని నిరూపించిన సినిమా ఇది.

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

సినిమా చూస్తూ కథకు కనెక్ట్‌ అయిన యూత్‌ వైష్ణవి పాత్రను దారుణంగా తిట్టుకుంటున్నారు.  అంతలా ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చివరకు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్‌ కూడా వైష్ణవిని తిట్టకండి అని, ఇదీ కథలో భాగమే అంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ సినిమాపై పలు ఫన్నీ మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. అందులో ఉపేంద్ర హీరోగా నటించిన ఓ సినిమాలోని సీన్‌ అందరినీ నవిస్తోంది. ఈ మీమ్స్‌ మీరు కూడా చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement