
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. వెబ్‌సిరీస్, షార్ట్ ఫిలింస్, సాంగ్ ఆల్బమ్స్‌తో విశేష గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. అడపదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కథానాయికగా బేబీ అనే సినిమా చేస్తోంది. వెండితెరపై హీరోయిన్‌గా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై గంపెడాశలు పెట్టుకుంది వైష్ణవి.
అయితే బేబీ పూర్తయిన వెంటనే ఈ నటి బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో అడుగు పెట్టనుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించింది వైష్ణవి. బేబీ చేస్తుండగా ఇంకా బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తానని ప్రశ్నించింది. సినిమా పూర్తయ్యాక సైతం బిగ్‌బాస్ షోకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతోంది. ఈసారి షోలో కామన్ మ్యాన్ కూడా పాల్గొనబోతున్నాడని నాగ్ ముందే చెప్పారు. ప్రస్తుతం కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం.
చదవండి: టాలీవుడ్ స్టార్స్‌కు ఆమిర్ ఖాన్ మెగా ప్రివ్యూ
నాన్న.. మూవీలో నా నెగెటివ్ పాయింట్స్ చెప్పారు: ఆది
Comments
Please login to add a commentAdd a comment