మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్‌! | [Baby Actress Vaishnavi Chaitanya Got This Special Gift From Brother Nitesh - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: రాఖీ.. బేబి హీరోయిన్‌కు తమ్ముడు ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?

Published Fri, Sep 1 2023 5:26 PM | Last Updated on Fri, Sep 1 2023 6:57 PM

Baby Actress Vaishnavi Chaitanya Got This Special Gift From Brother - Sakshi

రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. ఎంత దూరంలో ఉన్నా సరే, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకచోటకు చేరాల్సిందే! రాఖీ కట్టి తీరాల్సిందే! ఎంతో ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి అన్న/తమ్ముడు తనకు తోచినంతలో ఎంతో కొంత డబ్బో లేదంటే ఏదైనా బహుమతో ఇస్తాడు. తనకు కూడా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడంటోంది వైష్ణవి చైతన్య.

అయితే ఆ గిఫ్ట్‌ రాఖీ పండగకు కాకుండా తన బర్త్‌డేకి ఇచ్చాడంది. కానీ, ప్రతి రాఖీ పండగకు అదే గిఫ్ట్‌ చూపిస్తున్నాడంటోంది. ఇంతకీ ఆ బహుమతి మరేంటో కాదు పచ్చబొట్టు! వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకి గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నాడు. అలా తన ఎడమచేతిపై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అది నిజమైన టాటూ అనుకోలేదు, జోక్‌ చేస్తున్నాడనుకున్నాను. కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని అర్థమైంది. ఈ పచ్చబొట్టు వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట! చాలా ఎమోషనల్‌ అయిపోయా.. ఏడ్చేశాను. అప్పటి నుంచి రాఖీ కట్టిన ప్రతిసారి పచ్చబొట్టు చూపిస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది.

ఇకపోతే యూట్యూబ్‌ సెన్సేషన్‌ అయిన వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించాడు. జూలై 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.90 కోట్ల మేర వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసింది.

చదవండి: ఫోటో షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement