9 Days Baby Movie Box Office Collections - Sakshi
Sakshi News home page

Baby Movie Collections: తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?

Published Sun, Jul 23 2023 2:17 PM | Last Updated on Sun, Jul 23 2023 2:52 PM

Nine Days Baby Movie Collections Cross 50 Crore - Sakshi

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. 'కలర్‌ఫోటో'తో అలరించిన సాయి రాజేష్‌నే ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్‌కేఎన్‌ ఈ మూవీకి నిర్మాత.  జులై 14న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రాన్ని  కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మొదటి ఐదురోజులు చాలా థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్‌ బోర్డ్స్ కనిపించాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన బేబి సినిమా కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి.  

'మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే కొటేషన్‌తో వచ్చిన ఈ సినిమాను  చూసిన వారందరూ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో వైష్ణవి పాత్రని కూడా తిట్టుకుంటున్నారు. అంతలా కనెక్ట్‌ అయ్యారు కాబట్టే.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఒక రకంగా చిన్న సినిమాల పరంగా చూస్తే తక్కువ రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించిన మూవీగా బేబీ రికార్డు క్రియేట్‌ చేసింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌ అసభ్య ప్రశ్న.. కౌంటర్‌ ఇచ్చిన టాప్‌ హీరోయిన్‌)

ఈ సినిమా నిర్మించేందుకు సుమారు రూ. 10 కోట్ల వరకు బడ్జెట్‌ అయిందని టాక్‌. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చేసినట్లే. తర్వాత ఈ మూవీ మంచి లాభాల్లో కొనసాగుతుందని ఇండస్ట్రీ టాక్‌. ఈ సినిమా అన్ని చోట్ల కలెక్షన్స్‌ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. తాజాగా రెండో వారంలో అడుగు పెట్టింది. వీకెండ్‌ కాబట్టి సినిమా కలెక్షన్స్‌ మళ్లీ పెరిగాయి. కాబట్టి మరికొన్ని రోజులపాటు బేబీ ఫాలోయింగ్‌ కొనసాగడం గ్యారెంటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement