
విరాజ్ అశ్విన్, వైష్ణవి, ఆనంద్ దేవరకొండ
‘‘ప్రేక్షకులందరికి నచ్చే కథ ‘బేబీ’. మన ప్రేక్షకులకు ఎలా చూపిస్తే బాగుంటుందో అలా తెరకెక్కించారు సాయి రాజే‹Ù. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్‌కేఎన్, దర్శకుడు మారుతి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తితో తీసిన చిత్రమిది.
ఇప్పటిదాకా నన్ను సాయి రాజేష్ అన్నారు. ఈ సినిమా రిలీజయ్యాక ‘బేబీ’ దర్శకుడు అని పిలుస్తారు’’ అన్నారు. ‘‘మారుతి, నేను కలిసి ఈ మాస్ మూవీ మేకర్స్ సంస్థను స్థాపించాం. మా దృష్టిలో సినిమా అంటే అమ్మకం కాదు.. నమ్మకం. అలాంటి నమ్మకంతోనే ‘బేబీ’ నిర్మించాం’’ అన్నారు ఎస్‌కేఎన్. ‘‘నా కెరీర్‌లో సవాలు విసిరిన, సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘బేబీ’ విజయం సాధించాలని దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, వెంకటేష్ మహా, వశిష్ట అన్నారు.