అదిరిపోయిన పుష్పక విమానంలో సిద్‌ శ్రీరాం పాట | Samantha Unveils Anand Deverakondas Movie Song Pushpaka Vimanam Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Pushpaka Vimanam: వినసొంపైన ‘కల్యాణం, కమనీయం’ పాట

Published Fri, Jun 18 2021 6:42 PM | Last Updated on Sat, Jun 19 2021 6:10 PM

Samantha Unveils Anand Deverakondas Movie Song Pushpaka Vimanam Vijay Devarakonda - Sakshi

హైదరాబాద్‌: యూత్‌లో విజయ్‌ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు, మరీ అతని యాటిట్యూడ్‌కు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. అంత క్రేజ్‌ ఉన్న నటుడికి తమ్ముడిగా టాలీవుడ్‌లో హీరోగా సినీ ఆరంగ్రేటం చేసిన ఆనంద్‌ దేవరకొండ తన మొదటి సినిమా ‘దొరసాని’ నటనపరంగా మంచి మార్కులే పడినా, కలెక్షన్ల విషయంలో యావరేజ్‌గా నిలిచింది. ఇక రెండో సినిమా ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’తో హిట్‌ కొట్టడంతో ట్రాక్‌లో పడినట్లు కనిపించాడు.

ప్రస్తుతం ఈ  యువ నటుడు ‘పుష్పక విమానం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా గీతా షైనీ నటిస్తోంది. ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్‌ అప్డేట్‌గా ‘కల్యాణం’ పాట విడుదల అయ్యింది. అగ్రకథానాయిక సమంత సోషల్‌మీడియా వేదికగా ఈ పాటను విడుదల చేయగా విజయ్‌ దేవరకొండ సమంతకు ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 

‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్‌శ్రీరామ్‌, మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి రామ్‌ మిరియాల స్వరాలు అందించారు. విజయ్‌ దేవరకొండ సమర్పణలో కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

చదవండి: ఇట్స్‌ అఫిషియల్‌: ధనుష్‌తో శేఖర్‌ కమ్ముల త్రిభాషా చిత్రం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement