భయం.. అత్యాశ.. కుట్ర | Gam Gam Ganesha Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

భయం.. అత్యాశ.. కుట్ర

Published Sat, Sep 16 2023 2:03 AM | Last Updated on Sat, Sep 16 2023 2:03 AM

Gam Gam Ganesha Movie Teaser Launch - Sakshi

వంశీ, ఆనంద్‌ దేవరకొండ, ఉదయ్, అనురాగ్‌

ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’.  కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది.

‘బేబీ’ తో ఆడియన్స్‌ ఎంత ఎమోషనల్‌ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్‌టైన్‌ అవుతారు. ఉదయ్‌ కథ, విజన్‌ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్‌ పర్వతనేని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement