వైరల్‌ కావాలనే రష్మికతో అలా చిట్‌ చాట్‌ చేశాం: ఆనంద్‌ దేవరకొండ | Anand Deverakonda Talk About Gam Gam Ganesha Movie | Sakshi
Sakshi News home page

Anand Deverakonda: రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం

Published Wed, May 29 2024 6:40 PM | Last Updated on Wed, May 29 2024 8:03 PM

Anand Deverakonda Talk About Gam Gam Ganesha Movie

రష్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. నాతో పాటు మా ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటుంది. అందుకే గం.. గం.. గణేశా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఫన్నీగా చిట్‌ చాట్‌ చేశాం(చిట్‌ చాట్‌లో భాగంగా మీ ఫేవరెట్‌ హీరో ఎవరని అడగ్గా..ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్‌ (విజయ్‌ దేవరకొండ) పేరును రష్మిక చెప్పడంతో అది వైరల్‌ అయింది). అది వైరల్‌ అవుతుందని తెలిసే..కావాలనే అలా చేశాం. రష్మికకు అన్నకు(విజయ్‌ దేవరకొండ) మధ్య ఏదైన రిలేషన్ ఉంటే ఎప్పటికైనా బయటపడుతుంది కదా(నవ్వుతూ..). ఇప్పటికైతే రష్మిక మాకు మంచి స్నేహితురాలు మాత్రమే’ అని అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్‌ దేవరకొండ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలోనే  బేబి కథతో పాటు "గం..గం..గణేశా" స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.

ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.

ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. "గం..గం..గణేశా" కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది.

నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా...హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు.

ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం "గం..గం..గణేశా" స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.

వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.

నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.

"గం..గం..గణేశా"కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.

నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement