Middle Class Melodies Movie Telecasting on Zee5, February 14th - Sakshi
Sakshi News home page

జీ తెలుగులో మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌...

Published Fri, Feb 12 2021 7:58 PM | Last Updated on Fri, Feb 12 2021 8:13 PM

Middle Class Melodies Movie Will Air On Zee Telugu - Sakshi

కరోనా అనంతర పరిస్థితులు ఇంటింటి వినోదాన్ని అమాంతం మార్చేసిన వైనం తెలిసిందే. థియేటర్లు మూత పడడంతో సినీ అభిమానులకు చిన్నితెరే ఏకైక వినోద సాధనంగా మారింది. ఈ పరిస్థితుల్లో పలు చిన్న చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై ప్రేక్షకుల సినిమా ఆకాంక్షల్ని కొంత మేరకు తీర్చాయి. అదే సమయంలో నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహా, జీ ఫైవ్‌ వంటి పలు ఓటీటీ వేదికలు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి.

ఈ నేపధ్యంలో ఓటీటీ వేదికలపై విజయం సాధించిన వాటిలో కొన్నింటిని మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తుండగా... మరికొన్ని చిన్నితెరలోనే మరో వినోద సాధనమైన టీవీ తెరపై ప్రత్యక్షమవుతుండడం విశేషం. ఈ విశేషానికి శ్రీకారం చుడుతోంది మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ మూవీ. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా జీ ఫైవ్‌ వేదికగా ఈ సినిమా ఇప్పటికే మంచి హిట్టయింది. ఇప్పుడీ సినిమాని జీ తెలుగు చానెల్‌లో ప్రసారం చేస్తున్నారు. ప్రేమికుల రోజైన వాలెంటైన్స్‌ డేని పురస్కరించుకుని ఈ సినిమాని మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో అందిస్తున్నట్టు చానెల్‌ ప్రతినిధులు తెలిపారు.

చదవండి : (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి)
 (హీరో సుమంత్‌ అశ్విన్‌ హల్దీ ఫంక్షన్‌.. ఫొటోలు వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement