ఆసక్తికర వీడియో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ, అదేంటో చూశారా! | Vijay Devarakonda Shares Fun Video With His Brother Anand Deverakonda | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ఆసక్తికర వీడియో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ, అదేంటో చూశారా!

Published Tue, Nov 9 2021 5:12 PM | Last Updated on Tue, Nov 9 2021 9:35 PM

Vijay Devarakonda Shares Fun Video With His Brother Anand Deverakonda - Sakshi

విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కువగా యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో విజయ్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తనదైన మ్యానరీజంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. మొదట సహా నటుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన విజయ్‌ ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ స్థాయికి ఎదిగాడు. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా మారాడు. సొంతంగా బ్యానర్‌ పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీతో నిర్మాత మారాడు విజయ్‌.

చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్‌

తాజాగా తన సోదరుడు, హీరో ఆనంద్‌ దేవరకొండ ‘పుష్పక విమానం’ మూవీని తెరకెక్కించాడు. నవంబర్‌ 12 విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయాడు విజయ్‌. ఈ క్రమంలో తాజాగా విజయ్‌ తనదైన స్టైల్లో ‘పుష్పక విమానం’ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ తన తమ్ముడు ఆనంద్‌ను ఆటపట్టించిన ఆసక్తికర వీడియోను వదిలాడు. ఈ నేపథ్యంలో ఉదయం బెడ్‌ మీద నుంచి లేస్తూనే నాతో ఈ రోజు బెడ్‌ షేర్‌ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిపుతూ దుప్పటి లాగాడు విజయ్‌.

చదవండి: ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్‌

విజయ్‌ పక్కన ఉన్నది ఎవరాని చూడగా.. ఆనంద్‌ దేవరకొండ కనిపించాడు. ఇక కెమెరా ఆనంద్‌ వైపు చూపిస్తూ ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అంటూ అని అడుగుతూ ఆనంద్‌ను ఆటపట్టించాడు విజయ్‌. నిద్ర మోహంతో ఉన్న ఆనంద్‌ కాస్తా విసుక్కుంటూ మరోవైపు తిరుగ్గా అలాగే దుప్పటి లాగిన విజయ్‌కి.. ఆనంద్‌ సిగ్గు పడుతూ ‘నా పెళ్లాం లేచిపోయింది’ అంటూ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇలా వినూత్నంగా విజయ్‌ ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్‌ చేయడం చూసి ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఈ మూవీ నవంబర్‌ 12న విడుదల థియేటర్లో విడుదల కానుంది. ఇక విజయ్‌, పూరీ జగన్నాథ్‌తో ‘లైగర్‌’ సినిమా చేస్తున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement