
మారుతి, వాసు, సాయి రాజేష్, వంశీ, ఆనంద్
‘‘బేబీ’ ట్రైలర్ బాగుంది. జూలై 14న టీమ్ అంతా పండగ చేసుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
ఈ వేడుకలో ‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో.. ‘బేబీ’ అదే ఫీల్ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు’’ అన్నారు మారుతి. ‘‘ఈ చిత్రం నిర్మాతకు గౌరవాన్ని తీసుకొస్తుంది’’ అన్నారు సాయి రాజేష్. ‘‘బేబీ’ ప్రేక్షకులను నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది’’ అన్నారు ఆనంద్, విరాజ్. ఎస్‌కేఎన్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment