
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పటికే పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న పుష‍్ప-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజవ్వగా భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
(ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)
అయితే తాజాగా బేబీ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన బన్నీ క్రేజీ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. బేబీ సక్సెస్ మీట్‌లో డైలాగ్ చెప్పి బన్నీ ఫ్యాన్స్‌లో ఊత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
బన్నీ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ' సినిమా పేరు పుష్ప: ది రూల్. ఒకటే ముక్క ఉంటది. ఈ డైలాగ్ ఇక్కడ చెబుతానని నేను అనుకోలేదు. కానీ చెప్తున్నా. 'ఇడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్.' అంటూ వేదికపై నవ్వులు పూయించాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరై బేబీ మూవీ టీంను అభినందించారు. కాగా.. పుష్ప-2లో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
(ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్‌లో ఉండనుంది'.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నటుడు!)
Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the stage.
— Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023
| #Pushpa2 | #PushpaTheRule | pic.twitter.com/QXbEaSnR7S
Comments
Please login to add a commentAdd a comment