
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎంటర్‌టైనర్ బేబీ. రచయిత, దర్శకుడు సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జూలై 7న బేబీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఎకేఎన్ తన జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి మాట్లాడాడు.
'మన బ్రేకప్స్ లెక్కపెట్టుకుంటే ఇక్కడున్నవాళ్ల మేకప్‌లు ఆరిపోతాయి. లవ్‌లో ఫెయిలైనవాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడని నమ్ముతాను. చాలాసార్లు లవ్‌లో ఫెయిలయ్యాను, అందుకే జీవితంలో సక్సెస్ అయ్యాను. జీవితంలో తొలిసారి బ్రేకప్ అయినప్పుడు ఇంకో అమ్మాయిని ప్రయత్నించాను. అది కూడా ఎవర్నో కాదు, అక్కతో బ్రేకప్ అయితే ఆమె ఇగో దెబ్బతినాలని తన చెల్లినే ట్రై చేశాను. తర్వాత ఏమైందనే వివరాలు ఇక్కడ చెప్తే బాగోదు' అన్నాడు ఎస్‌ఎకేఎన్.
చదవండి: మరో నటితో దొరికాడు.. బ్రేకప్ చెప్పిన విషయం తెలిసి నాన్నకు గుండెపోటు: నటి
Comments
Please login to add a commentAdd a comment