Allu Arjun Says He Is Big Fan Of Chiranjeevi At Baby Appreciation Meet - Sakshi
Sakshi News home page

Allu Arjun: కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే.. ఇదెప్పటికీ మారదు!

Published Fri, Jul 21 2023 10:33 AM | Last Updated on Fri, Jul 21 2023 11:05 AM

Allu Arjun Says He Is Big Fan of Chiranjeevi at Baby Appreciation Meet - Sakshi

గత వారం రోజుల నుంచి థియేటర్స్‌ను బేబి రఫ్ఫాడిస్తోంది. సినీ ప్రియుల మాటేమిటో కానీ యూత్‌ మాత్రం బేబి పేరును తెగ కలవరిస్తున్నారు. ఫలితంగా కలెక్షన్ల వరద పారుతోంది. చిన్న సినిమా అయినా విశేష స్పందన రావడంతో బేబి చిత్రయూనిట్‌ ఆనందంలో మునిగి తేలుతోంది. నేటితో ఈ సినిమా రూ.50 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బేబి అప్రిషియేషన్‌ మీట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'బేబి సినిమా నాకు చాలా నచ్చింది. సినిమా చూస్తూ లేచి నిలబడి చప్పట్లు కొట్టేస్తున్నా.. అంత బాగా నచ్చింది. నిర్మాత ఎస్‌కేఎన్‌, నేను.. కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానులమే! అది మారదు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సైట్‌లో ఓ డ్యాన్స్‌ ఫ్లోర్‌లో నేను డ్యాన్స్‌ చేసేవాడిని. అక్కడున్న చిన్న గదిలో ఎస్‌కేఎన్‌ ఎన్నో ఏళ్లు ఉన్నాడు. అది వాచ్‌మెన్‌ గది కంటే కూడా చిన్నగా ఉండేది. తర్వాత జర్నలిస్టుగా, పీఆర్‌వోగా, నిర్మాతగా మారి సక్సెస్‌ అయ్యాడు' అని చెప్పుకొచ్చాడు బన్నీ. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ స్పీచ్‌కు అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు.

బేబీ విషయానికి వస్తే..
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించగా ఎస్‌కేఎన్‌ నిర్మించారు. జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో బేబీ సినిమాను తీశారు. అందుకే ఈ సినిమా యువతరానికి బాగా కనెక్ట్‌ అయింది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: సినీ నటిపై అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement