Baby Movie OTT Details: సాధారణంగా చిన్న సినిమాలకు బజ్ తక్కువ. థియేటర్లలోకి వచ్చినాసరే జనాలు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది అసలు స్టార్ నటీనటులు, డైరెక్టర్, నిర్మాత లేని ఓ సినిమా కోసం కొన్నాళ్ల నుంచి అందరూ తెగ వెయిట్ చేశారు. అదే 'బేబి'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. అలానే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ని కూడా ఫిక్స్ చేసుకుంది.
ఒక్క పాట వల్ల
గత కొన్ని నెలల నుంచి ఓ పాట తెలుగు మ్యూజిక్ లవర్స్ పదే పదే వింటున్నారు. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా..' అనే ఒక్క సాంగ్.. 'బేబి' సినిమాపై అంచనాలని పెంచేసింది. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ఉందని చూసిన ప్రతిఒక్కరూ చెబుతున్నారు. తెలిసిన ప్రేమకథలానే ఉన్నప్పటికీ, దాన‍్ని డీల్ చేసిన విధానం, టేకింగ్, డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు.
(ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ)
ఆ ఓటీటీలో
ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావొచ్చని సమాచారం. కొన్నాళ్లు ఆగితే ఈ విషయమై క్లారిటీ వస్తుంది.
'బేబి' కథేంటి?
వైష్ణవి(వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో లవ్‌లో పడుతుంది. స్కూల్‌లోనే వీళ్ల ప్రేమ ముదిరిపోతుంది. అయితే పది పాస్ అయిన వైష్ణవి ఇంజినీరింగ్ వరకు వెళ్తుంది. ఆనంద్ మాత్రం ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారతాడు. ఇక కాలేజీకి వెళ‍్లి వైషూ లైఫ్‌లోకి విరాజ్(విరాజ్ అశ‍్విన్) వస్తాడు. మరి చివరకు ఏమైంది? ఆనంద్-వైషూ ఒక్కటయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?)
Comments
Please login to add a commentAdd a comment