డ్ర‌గ్స్ కేసు: నాకేం బాధ లేదు | Drugs Case: Navdeep Strong Reply To Troll | Sakshi
Sakshi News home page

డ్ర‌గ్స్ కేసు: నువ్వేం బాధ‌ ప‌డ‌కు

Published Sat, Sep 12 2020 7:50 PM | Last Updated on Sat, Sep 12 2020 8:12 PM

Drugs Case: Navdeep Strong Reply To Troll - Sakshi

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మ‌హ‌త్య కేసులో వెలుగు చూసిన డ్ర‌గ్స్ కోణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్ట్ చేయ‌గా.. ఆమె 25 మంది సినీ ప్ర‌ముఖుల పేర్లు వెల్ల‌డించారు. రియా ఇచ్చిన స‌మాచారం మేరకు వారంద‌రికీ నోటీసులు జారీ చేసేందుకు ఎన్సీబీ సిద్ధ‌మ‌వుతోంది. ఈ వ్య‌వ‌హారంలో హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుండ‌టంతో టాలీవుడ్‌లో మ‌రోసారి అల‌జ‌డి మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో ఓ నెటిజన్ "ర‌కుల్ - మంచు -రానా - న‌వ‌దీప్‌. ఇది మ‌ళ్లీ టాలీవుడ్‌కు యూట‌ర్న్ తీసుకుంది. అన్నా మ‌న‌కీ బాధ‌లు త‌ప్పేలా లేవు" అంటూ వెట‌కారంగా న‌వ్వుతున్న ఎమోజీల‌తో న‌టుడు న‌వ‌దీప్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన న‌వ‌దీప్‌.. "నాకేం బాధ లేదు బ‌ద్ర‌ర్‌.. నువ్వు కూడా ఏ బాధా ప‌డ‌కు. ప‌ద‌, ప‌నికొచ్చే ప‌నులు చేసుకుందాం" అని నోరు మూయించాడు. (చ‌ద‌వండి: వికారాబాద్‌ అడవుల్లో రకుల్‌..)

కాగా 2017లో హైద‌రాబాద్‌లో వెలుగు చూసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను అత‌లాకుత‌లం చేసింది. అప్ప‌ట్లో ఈ కేసు విచార‌ణ కోసం ఎక్సైజ్ శాఖ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ అధికారులు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ చార్మీ, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, న‌టుడు సుబ్బరాజు, త‌రుణ్, న‌వ‌దీప్ స‌హా ప‌లువురిని విచారించారు. ఆ త‌ర్వాత వీరికి డోప్ టెస్ట్ కోసం శాంపిల్స్ కూడా సేక‌రించారు. (చ‌ద‌వండి: డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement