నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందంటూ చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త బోల్డ్ కంటెంట్‌తో ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్‌గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' అధికారికంగా ప్రకటన చేసింది. 'లవ్ మౌళి' చిత్రం జూన్ 27నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. రిలేషన్‌లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో కథ ఉంటుంది.
కథేంటి?
మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు.
కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?
Comments
Please login to add a commentAdd a comment