Love Mouli Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చాన్నాళ్ల తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి. 'కల్కి' దెబ్బకు చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో చూసినవాళ్లు తెగ ఆనందపడిపోతున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై 'కల్కి' మేజిక్ చూసేద్దామా అనే ఆత్రుతలో ఉన్నారు. దీనికి డబుల్ బొనాంజా అన్నట్లు ఓటీటీలోనూ క్రేజీ తెలుగు సినిమాలు మూడు వచ్చేశాయి. 'కల్కి'తో పాటు వీకెండ్లో వీటిని కూడా చూసేసే ప్లాన్ చేసుకోండి.పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది గానీ రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లేట్ కథ కావడం మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థ్రిల్లర్ మూవీతో టైమ్ పాస్ చేద్దామనుకునేవాళ్లు దీనిపై లుక్కేయండి.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడిన కార్తికేయకు సంతృప్తి ఇచ్చిన మూవీ 'భజే వాయు వేగం'. గత నెల చివర్లో వచ్చి అనుహ్యంగా హిట్ కొట్టిన థ్రిల్లర్ మూవీ ఇది. అన్నదమ్ముల బాండింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.చాన్నాళ్ల తర్వాత నవదీప్ 'లవ్ మౌళి' అనే బోల్డ్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు బోల్డ్‌నెస్‌లో శృతిమించిపోయారు. అయితే యువతకు మాత్రమే కొంతలో కొంతమేర నచ్చిన ఈ చిత్రం.. 'కల్కి' రిలీజ్ రోజే ఆహా ఓటీటీలో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఇది మీకు ఛాయిస్ అవ్వొచ్చు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఇది 'కల్కి' వారమని చెప్పొచ్చు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ ప్రేక్షకులని పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణలో బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ దృష్టంతా 'కల్కి' పైనే ఉంది. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం దాదాపు 21 సినిమాలు-సిరీసులు రాబోతున్నాయి. కాకపోతే వాటిలో ఒకటో రెండో మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. లవ్ మౌళి అనే తెలుగు సినిమా మాత్రమే ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. దీనితో పాటు ఆవేశం హిందీ వెర్షన్, శర్మజీ కీ బేటీ అనే హిందీ మూవీ ఉన్నంతలో చూడొచ్చు అనిపించేలా ఉన్నాయి. మిగతావన్నీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి వాటి టాక్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుంది అనే జాబితా ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూన్ 24 నుంచి 30 వరకు)అమెజాన్ ప్రైమ్ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 25సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 28శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) - జూన్ 28నెట్ఫ్లిక్స్కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) - జూన్ 25వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) - జూన్ 27సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27ద 90'స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) - జూన్ 27ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) - జూన్ 28ఆహాఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) - జూన్ 25లవ్ మౌళి (తెలుగు సినిమా) - జూన్ 27జీ5రౌతు కీ రాజ్ (హిందీ మూవీ) - జూన్ 28హాట్స్టార్ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) - జూన్ 28ఆపిల్ ప్లస్ టీవీల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28సైనా ప్లేహిగ్యుటా (మలయాళ సినిమా) - జూన్ 28(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?) -
ఓటీటీలో తెలుగు బోల్డ్ సినిమా 'లవ్ మౌళి'
నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందంటూ చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త బోల్డ్ కంటెంట్‌తో ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' అధికారికంగా ప్రకటన చేసింది. 'లవ్ మౌళి' చిత్రం జూన్ 27నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. రిలేషన్లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో కథ ఉంటుంది.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు.కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ? View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
'లవ్ మౌళి' సినిమా రివ్యూ
కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందని ప్రమోషన్స్ చేశారు. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త అంచనాలు పెంచాయి. ట్రైలర్లో ముద్దు, బోల్డ్ సీన్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?ఎలా ఉందంటే?'లవ్ మౌళి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధారణ ప్రేమకథ. కాకపోతే ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని వెతికే క్రమంలో ఓ అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తీశారు. అయితే తొలి సగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే ఉంటుంది.సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఓ చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చేస్తుంది. ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ప్రమోషన్స్‌లో 2.0 అనేలా నవదీప్ యాక్ట్ చేశాడు. బాడీ, సీన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి. -
రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను: నవదీప్
‘‘లవ్ మౌళి’ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేశాం. ఎన్నో వ్యయ ప్రయాసలతో అక్కడ షూట్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎప్పుడూ వర్షం పడే ఆ ప్రదేశంలో సినిమా మీద ప్యాషన్‌తో షూటింగ్ చేశాం. ఈ సినిమాలోని నా పాత్ర కోసం రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను. ‘లవ్ మౌళి’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని హీరో నవదీప్ అన్నారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ప్రారంభంలో జెట్ స్పీడులో వెళ్లింది. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లుగా కెరీర్ మార్చుకోవాలనిపించింది. ఆ సమయంలో విన్న కథే ‘లవ్ మౌళి’. ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. అందరికీ కనెక్ట్ అవుతుంది.ముఖ్యంగా యువతకు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ‘లవ్ మౌళి’ విజయంతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందనుకుంటున్నాను. సరదాగా హీరో రానాకు ఈ చిత్రకథ చెప్పాను. కథ బాగుండటంతో అఘోరా పాత్ర చేశాడు. ప్రస్తుతం తమిళంలో నిత్యా మీనన్‌తో ఓ సినిమా, అలాగే ‘న్యూసెన్స్ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను నటించిన మరికొన్ని వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
నా కోసం రానా అఘోరగా నటించాడు : హీరో నవదీప్
‘లవ్ మౌళి’కథను సరదాగా నా స్నేహితుడు రానాకు చెప్పాను. స్టోరీ మొత్తం విన్నాక.. చాలా బాగుందని చెప్పి అందులోని అఘోర పాత్రను చేశాను. నిజంగా చెప్పాలంటే రానాకు ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా కోసం చేశాడు. ఈ సినిమాలో రానా అఘోరగా నటించాడని ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు’అని అన్నారు హీరో నవదీప్. చాలా తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’.రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు ఉన్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్‌ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను.⇒ ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాషన్‌తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.⇒ ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి ఉంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.⇒ ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్‌లో ఉండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.⇒ ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్‌మౌళి ఎక్స్పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.⇒ నా రియల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనుభవాలను ఇందులో చూపించాడు. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా ఉంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉంచితే.. బాగుంటుంది.⇒ న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు తమిళంలో నిత్యమీనన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. -
అందుకే బోల్డ్ సీన్స్ పెట్టాను : ‘లవ్ మౌళి’ దర్శకుడు
‘సాధారణంగా ఒక కథ రాస్తున్నప్పుడు ఒకరిని ఊహించుకుంటాం. కానీ లవ్‌మౌళి కథ రాస్తున్నప్పుడు అలా ఊహించుకోలేదు. ఒక నవలలా రాసేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. ఓసారి నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు’అని అన్నాడు డైరెక్టర్ అవనీంద్ర. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.→ ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.→ ఇది నా ఫస్ట్ సినిమా. నిజాయితీగా ఓ మంచి కథను చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.→ ఈ సినిమాలో హీరోకి లో దుస్తుల్లో మందు తాగే సీన్ ఉంటుంది. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.→ ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.→ రిలేషన్లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. లస్ట్ కోసం కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.→ నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఈ సినిమా ద్వారా చెప్పాను.→ విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లకపోయావ్ అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.→ ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.→ ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.