ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే? | Upcoming Telugu Movies OTT Release In June 2024 Last Week | Sakshi | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లోకి ఏకంగా 21 మూవీస్.. అదొక్కటే కాస్త స్పెషల్!

Published Mon, Jun 24 2024 8:29 AM | Last Updated on Mon, Jun 24 2024 10:26 AM

Upcoming OTT Movies Telugu Latest June Last Week 2024

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఇది 'కల్కి' వారమని చెప్పొచ్చు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ ప్రేక్షకులని పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణలో బుకిం‍గ్స్ మొదలైపోయాయి. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.  దీంతో మూవీ లవర్స్ దృష్టంతా 'కల్కి' పైనే ఉంది. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం దాదాపు 21 సినిమాలు-సిరీసులు రాబోతున్నాయి. కాకపోతే వాటిలో ఒకటో రెండో మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)

ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. లవ్ మౌళి అనే తెలుగు సినిమా మాత్రమే ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. దీనితో పాటు ఆవేశం హిందీ వెర్షన్, శర్మజీ కీ బేటీ అనే హిందీ మూవీ ఉన్నంతలో చూడొచ్చు అనిపించేలా ఉన్నాయి. మిగతావన్నీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి వాటి టాక్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుంది అనే జాబితా ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూన్ 24 నుంచి 30 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇం‍గ్లీష్ సినిమా) - జూన్ 25

  • సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 28

  • శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) - జూన్ 28

నెట్‌ఫ్లిక్స్

  • కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) - జూన్ 25

  • వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26

  • డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) - జూన్ 27

  • సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27

  • ద 90'స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27

  • ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) - జూన్ 27

  • ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28

  • ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28

  • ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) - జూన్ 28

ఆహా

  • ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) - జూన్ 25

  • లవ్ మౌళి (తెలుగు సినిమా) - జూన్ 27

జీ5

  • రౌతు కీ రాజ్ (హిందీ మూవీ) - జూన్ 28

హాట్‌స్టార్

  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27

  • ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) - జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ

  • ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26

  • ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28

  • వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28

సైనా ప్లే

  • హిగ్యుటా (మలయాళ సినిమా) - జూన్ 28

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement