
వాలంటైన్స్ డే.. అదృష్టం బాగుంటే వన్ సైడ్ లవ్ కాస్తా టూ సైడ్ లవ్‌గా మారుతుంది. లేదంటే నో అన్న సమాధానంతో ఆ ప్రేమకు ఆదిలోనే ముగింపు కార్డు పడుతుంది. ఇక అప్పటిదాకా సీక్రెట్‌గా లవ్ చేసుకున్నవాళ్లు అఫీషియల్‌గా కూడా వారి ప్రేమను బయటపెడుతుంటారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే నిన్నటి వాలంటైన్స్‌డే రోజు హీరో నవదీప్ ఓ పోస్ట్ పెట్టాడు.
ఓ అమ్మాయి చేతుల నిండా మెహందీ, ఎడమ చేతికి మెరిసిపోతున్న ఉంగరం, మరో చేతితో ముఖాన్ని దాచుకున్నట్లుగా ఉంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఈ వాలంటైన్స్ డే చాలా స్పెషల్ అని రాసుకొస్తూనే ఖుషీ అహుజా అన్న అకౌంట్‌ను జత చేశాడు. ఇంకేముంది.. ఆ అమ్మాయెవరో ఆరా తీద్దామని నెటిజన్లు ప్రయత్నించే క్రమంలో నవదీప్ ప్రాంక్ చేశాడని తెలుసుకున్నారు. ఆ అకౌంట్ ఓపెన్ చేయగా.. చూసింది చాలు కూర్చో అన్నట్లుగా ఓ డైలాగ్ కనబడింది. దీంతో హర్టైన ఫ్యాన్స్ గుడ్‌న్యూస్ చెప్తావనుకుంటే ఇలా బకరా చేశావేంటన్నా అని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని నవదీప్ అన్న మోసం చేశాడని వీడియో చేయగా దాన్ని ఇన్‌స్టా స్టోరీలో తిరిగి షేర్ చేశాడు హీరో.
Comments
Please login to add a commentAdd a comment