హైదరాబాద్: ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో బుల్లితెరపై సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. టీఆర్పీల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. తారక్ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న ఈషోకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. షోలో కంటెస్టంట్లలో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ షోని రక్తికట్టిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టంట్ల సంఖ్య తగ్గేకొద్ది వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. గతంలో జ్యోతి, మధు ప్రియ ఎలిమినేట్ అవగానే గోపాల గోపాల సినిమా ఫేం దీక్షా పంత్ బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టింది.
గతవారం కూడా సమీర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే షోలోకి కొత్తగా ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారని ప్రేక్షకులు అనుకున్నారు. దీనిపై పలు రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అనుకున్నట్లుగానే మరొక హీరో ఎంట్రీ ఇవ్వనున్నారు. దృవ ఫేం నవదీప్ షోలో అడుగు పెట్టనున్నాడు. షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నటుడు నవదీప్ కనిపించనున్నాడని తాజా సమాచారం. డ్రగ్స్ కేసులో ముమైత్‌ఖాన్‌తోపాటు నవదీప్ కూడా విచారణకు హాజరైన విషయం విదితమే.