మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి | NTR Bigg Boss Telugu Season 1 Retelecast in Star Maa Music | Sakshi
Sakshi News home page

మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి

Published Sun, Apr 12 2020 3:59 PM | Last Updated on Sun, Apr 12 2020 4:08 PM

NTR Bigg Boss Telugu Season 1 Retelecast in Star Maa Music - Sakshi

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుత్ను వేళ.. చాలా మంది ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఇళ్లు ఓ బిగ్‌బాస్‌ హౌస్‌గా మారిపోయింది. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా, సీరియల్‌.. ఇలా అన్ని రకాల షూటింగ్స్‌ నిలిచిన పోయిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఆదరణ పొందిన షోలను, సీరియల్స్‌ను ప్రసారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్‌ మా కూడా జనాన్ని అలరించడానికి బిగ్‌బాస్‌ షోలను పున: ప్రసారం చేస్తోంది. ఇప్పటికే కింగ్‌ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని రిపీట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా స్టార్‌ మా మ్యూజిక్‌ నేటి నుంచి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తొలిసారిగా బుల్లితెరపై అభిమానులను అలరించిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-1ను ప్రసారం చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు, మళ్లీ రాత్రి 10 గంటలకు ఈ షోను ప్రసారం చేయనున్నట్టు తెలిపింది. దీనిపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2017లో ప్రసారం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-1తో ఎన్టీఆర్‌ వ్యాఖ్యతగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 70 రోజులపాటు కొనసాగిన ఈ సీజన్‌ చాలా బాగా జరిగింది. తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్‌ షోను ఆదరించేలా చేసింది. ఈ సీజన్‌లో శివ బాలజీ టైటిల్‌ను సొంతం చేసుకోగా, ఆదర్శ్‌ బాలకృష్ణ రన్నరప్‌గా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement