బుల్లితెరపై నవదీప్ | Navdeep To Host Reality Show on Small Screen | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై నవదీప్

Published Wed, Jun 22 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

బుల్లితెరపై నవదీప్

బుల్లితెరపై నవదీప్

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జై సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయిన యంగ్ హీరో నవదీప్. లుక్ విషయంలో, నటన విషయంలో ఎలాంటి రిమార్క్స్ లేకపోయినా స్టార్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అయితే హీరో పాత్రే చేయాలంటూ పట్టు పట్టకపోవటంతో నవదీప్ కెరీర్ బిజీగానే సాగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్స్కు నవదీప్ బెస్ట్ చాయిస్లా కనిపిస్తున్నాడు.

అంతేకాదు పలు కార్యక్రమాలకు హోస్ట్గా కూడా తన సత్తా చూపిస్తున్నాడు నవదీప్. ఇటీవల జరిగిన ఐఐఎఫ్ఎ అవార్డ్ ఫంక్షన్తో పాటు, బ్రహ్మోత్సవం ఆడియో వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా మరో కొత్త కార్యక్రమంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఓ ప్రముఖ చానల్లో నిర్వహిస్తున్న రియాల్టీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ నిర్మాతగా వైజయంతీ టెలిఫిలింస్ నిర్మిస్తున్న ఈ కార్యక్రమంలో 15 మంది టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాహసాలు చేయనున్నారు. వారిని సమన్వయపరిచే బాధ్యతను నవదీప్ తీసుకున్నాడు. దీంతోపాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు నవదీప్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement