
రఫ్ఫాడిస్తాం!
ఈ స్టిల్ చూస్తుంటే.. ‘లుక్ చూడు ఎంత రఫ్‌గా ఉందో... ఐపీయస్‌గా రఫ్ఫాడిస్తా’ అని రామ్‌చరణ్ చెప్తున్నట్టుంది కదూ!
ఈ స్టిల్ చూస్తుంటే.. ‘లుక్ చూడు ఎంత రఫ్‌గా ఉందో... ఐపీయస్‌గా రఫ్ఫాడిస్తా’ అని రామ్‌చరణ్ చెప్తున్నట్టుంది కదూ! చరణ్ వెనుక నవదీప్ కూడా రెడీ. ట్రైనీ ఐపీఎస్‌గా రామ్‌చరణ్ ఎంత రఫ్ఫాడించారో చూడాలంటే కొత్త సినిమా విడుదలయ్యే వరకూ ఎదురు చూడాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ధ్రువ’.
ఇందులో ప్రతినాయకుడిగా ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. చరణ్, నవదీప్, ఇతర తారాగణం పాల్గొనగా టాకీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గత నెలలో చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లపై కాశ్మీర్‌లో పాటలను చిత్రీకరించారు. తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’కి తెలుగు రీమేక్ ఇది.