
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. ఆయనే ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ కూడా. ఈ మూవీని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి.సుమంత్ నాయుడు విచ్చేశారు. డ్యాషింగ్ డైరెక్టర్ 'రామ్ గోపాల్ వర్మ' ఈ చిత్ర బృందానికి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర దురాశ చుట్టూ తిరిగే కథ. మూవీ ఇంతకంటే రంజిపజేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పాటు సెప్టెంబర్‌లో మూవీ థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు.
(ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?)