
లండన్ నుంచి బాధగా...
సినిమా కంప్లీట్ అయిన తర్వాత యాక్టర్స్ చివరి రోజున ఎమోషన్ అవ్వడం సహజమే. నెలల తరబడి కలిసి పని చేస్తారు కాబట్టి, ‘టాటా’ చెప్పేటప్పుడు అలా అయిపోతుంటారు. తమన్నా కూడా ఇలా ఎమోషన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు జస్ట్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినందుకే ఫీలవుతున్నారామె. అంతగా చిత్రబృందంతో కలిసిపోయినట్లున్నారు.
కునాల్ కోహ్లీ డైరెక్షన్‌లో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను మే 28న లండన్‌లో స్టార్ట్ చేశారు. ఇందులో నవదీప్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ‘‘లండన్‌లో సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. యూనిట్ మెంబర్స్‌ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. వీళ్లందరితో ఈ సినిమా షూటింగ్ చాలా జాయ్‌ఫుల్‌గా, సూపర్‌గా జరిగింది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమన్నా.