విభిన్న కథనంతో... | Once upon from Bham Bolenath | Sakshi
Sakshi News home page

విభిన్న కథనంతో...

Published Sun, Dec 7 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

విభిన్న కథనంతో...

విభిన్న కథనంతో...

నవదీప్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. కార్తీక్‌వర్మ దండు దర్శకుడు. శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మాత. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా,  ప్రచార చిత్రాలను నిఖిల్, సందీప్‌కిషన్, ప్రిన్స్, చందు మొండేటి, సుధీరవర్మ కలిసి విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన నాని, వరుణ్‌సందేశ్, శశాంక్, కమల్ కామరాజ్, కిరణ్, మధుశాలిని, పూజా జవేరి, ప్రాచీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. టికెట్‌కి పూర్తి న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. విభిన్నమైన కథనంతో కార్తీక్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని నవీన్‌చంద్ర అన్నారు. సంగీతానికి ఆస్కారమున్న సినిమా ఇదని సంగీత దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement