
బిగ్ బాస్: అదే నాకు శాపంలా మారింది!
తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్'. యాభైకి పైగా ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ షో విజయవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో షో కంటెస్టెంట్లలో ఒకరైన నటుడు నవదీప్ కాస్త నిరాశ చెందినట్లు కనిపించారు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు శాపంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా నవదీప్ ఈ విధంగా స్పందించారు.
టాస్క్‌లో భాగంగా కెప్టెన్ శివబాలాజీని మినహాయించగా.. అర్చన, దీక్షా పంత్, హరితేజ, ప్రిన్స్, ఆదర్శ్, నవదీప్ లు చర్చించుకని.. ఓ నిర్ణయానికి రావాలి. ఆపై రియాల్టీ షోలో బలమైన కంటెస్టెంట్లు 1వ స్థానం, ఆ తర్వాత స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లు 2వ స్థానం అలా అందరూ నిల్చోవాలి. ప్రిన్స్, నవదీప్‌లు ఫస్ట్ ప్లేస్‌కి మేము అర్హులమని వాదనలు వినిపించగా.. చివరికి మెజార్టీతో ప్రిన్స్ 1వ స్థానంలో నిల్చుంటారు. ఆ తర్వాత వరుసగా హరితేజ, నవదీప్, అర్చన, ఆదర్శ్, దీక్ష స్థానాలు డిసైడ్ అవుతాయి. కేవలం తాను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం తనకు శాపంగా మారిందని, కొన్ని సందర్బాల్లో ఇదే అంశం తనకు మైనస్ అవుతుందున్నారు నవదీప్. అందరిలా తొలిరోజు నుంచి షోలో ఉంటే తనకూ మరింతగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండేదంటారు.