కూల్‌గా భయపెట్టే... | Ice Cream to be released on Table Profit | Sakshi
Sakshi News home page

కూల్‌గా భయపెట్టే...

Published Mon, Jul 7 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

కూల్‌గా భయపెట్టే...

కూల్‌గా భయపెట్టే...

‘‘నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ‘ఐస్‌క్రీమ్’. కూల్‌గా భయపెట్టే సినిమా ఇది. ఫ్లోకేమ్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నవదీప్, తేజస్వి జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం ‘ఐస్‌క్రీమ్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ప్రద్యోతన్ స్వరపరచిన ఈ చిత్రం థీమ్‌సాంగ్‌ని హైదరాబాద్‌లో నవదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నెల 11న టేబుల్ ప్రాఫిట్‌తో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించడం పట్ల నవదీప్, తేజస్వి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement