హాట్ ఐస్‌క్రీమ్ | Actress Tejaswi Goes Nude for Ram Gopal Varma's "Ice Cream movie | Sakshi
Sakshi News home page

హాట్ ఐస్‌క్రీమ్

Published Wed, Jul 9 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

హాట్ ఐస్‌క్రీమ్

హాట్ ఐస్‌క్రీమ్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌బాబు ముద్దుపెట్టేస్తా అంటే భయపడి పారిపోయిన పాత్రతో వెలుగులోకి వచ్చిందా  సిటీబ్యూటీ. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై ‘హాట్’ టాపిక్. రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ చిత్రంలో న్యూడ్‌గా నటించానంటూ పబ్లిగ్గా అంగీకరించి సంచలనం రేపింది. నగరంలోని బేగంపేటలో సెయింట్‌ఫ్రాన్సిస్ కాలేజీలో చదివిన తేజస్వి... డ్యాన్స్ టీచర్‌గా కూడా సిటీలో చాలా మందికి తెలుసు.
 
 ఏదో సినిమాలో అడపాదడపా కనిపిస్తుందిలే అనుకుంటుంటే ఏకంగా రామ్‌గోపాల్‌వర్మ చిత్రంలో.. అదీ న్యూడ్‌గా నటించిందంటూ తెలియడంతో ఇది షాకింగ్ న్యూస్ అయింది. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ... వర్మతో పనిచేయడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని, ఆయన ఒక మాస్ట్రో అని కితాబిస్తోంది తేజస్వి. ఐస్‌క్రీమ్ అంటే మహా ఇష్టమంటున్న ఈ బ్యూటీ స్పెయిన్‌లో ఐస్‌క్రీమ్స్ భలే రుచిగా ఉంటాయంది. సినీ పరిశ్రమ తనకు ఎంతో నచ్చిందంటోంది. ఫైనల్‌గా తనకు సంబంధించి వచ్చే రూమర్లపై ఎలా స్పందిస్తావంటే... ‘‘బాగా కష్టపడడం, మన అంతరంగం చెప్పినదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లిపోవడం అంతే’’ అని తేల్చేసింది.
 - సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement