నేను నగ్నంగా నటించిన మాట నిజమే! | i am acting nude in this film | Sakshi
Sakshi News home page

నేను నగ్నంగా నటించిన మాట నిజమే!

Published Thu, Jul 3 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

నేను  నగ్నంగా నటించిన  మాట నిజమే!

నేను నగ్నంగా నటించిన మాట నిజమే!

 తేజస్వి... ఈ పేరు ప్రస్తుతం ఓ సెన్సేషన్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ... ఓవర్‌నైట్ హీరోయిన్ అయిపోయిన లక్కీ గాళ్ తేజస్వి. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోందీ ముద్దుగుమ్మ.దక్షిణాదిన ఏ హీరోయిన్నూ చేయలేని ఫీట్ చేసేసి అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో  హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ ‘ఐస్‌క్రీమ్’ పాపతో ‘సాక్షి’ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ.

 ఏంటి? సంచలనాలు సృష్టించేస్తున్నారు?
 నేను కాదు... రామ్‌గోపాల్‌వర్మగారు. ఈ ప్రశ్న మీరు ఆయన్నే అడగాలి.

 న్యూడ్‌గా నటించింది మీరే కదా?
 వర్మ గారు చేయమంటే చేశాను. ఆయన అలా ఎందుకు చేయమన్నారో తెరపై చూస్తే కానీఅర్థం కాదు. ఎందుకు చేయమన్నా, ఎలా చేయమన్నా, న్యూడ్‌గా చేయడం సాధారణమైన విషయం కాదు కదా. చుట్టూ యూనిట్ సభ్యులు...ఆగండాగండి... అంటే... అందరి ముందూ అలా చేసేశాననా మీ అనుమానం.

కాదా?
 నేనూ అందరిలాంటి అమ్మాయినే. అంతమంది ముందు అలా ఎలా చేస్తాననుకున్నారు? కథ రీత్యా ఈ సన్నివేశం సినిమాకు చాలా ముఖ్యం. ఆ విషయాన్నే వర్మగారు చెప్పారు. అలా చేస్తే తప్ప ఆ సన్నివేశం పండదని నాకూ అనిపించింది. అయితే... ‘అందరి ముందూ ఎలా?’ అని అడిగాను. దానిక్కూడా వర్మగారే పరిష్కారం చెప్పారు. ‘మేమంతా బయటకు వెళ్లిపోతాం. రూమ్‌లో కెమెరా, నువ్వు అంతే... అల్రెడీ కెమెరా ఆన్‌లో ఉంటుంది. నువ్వు దాని ముందు సీన్ చేసేయ్. తర్వాత నువ్వే కెమెరా ఆఫ్ చేసేయ్... దట్సాల్...’’ అన్నారు. ఆయన చెప్పినట్టే చేశాను.
 సరే... తర్వాత అయినా... కెమెరాలో అందరూ చూస్తారుగా?
 అసలు నేను ఏం చేశానో, ఎలా చేశానో మీకు చెప్పలేదు కదా. అది రివీల్ చేస్తే కిక్ ఉండదు.
 అంటే... సినిమాకు హైప్ తీసుకురావడానికి చేసిన చిన్న టెక్నిక్ అన్నమాట.
ఇందులో అబద్ధం ఏమీ లేదు. నేను న్యూడ్‌గా చేసిన మాట నిజమే.

చిన్న చిన్ని పాత్రలు చేస్తూ ఉన్న ఫళంగా హీరోయిన్ అయిపోయారు. అంతే స్పీడ్‌గా స్టార్ అయిపోదామనా ఈ తాపత్రయం?
 మీకు తెలీదనుకుంటా. నాకసలు యాక్టింగ్ అంటే ఆసక్తే లేదు. అసలు ఇప్పటివరకూ ఒక్కరిని కూడా నేను అవకాశం అడగలేదు. అవన్నీ వాటంతట అవే నా దగ్గరకొచ్చాయి.

అసలు మీ నేపథ్యం ఏంటి?
మా అమ్మది గుంటూరు. నాన్నది విజయవాడ. జర్నలిజం చదివాను. చిన్నప్పట్నుంచీ డాన్సంటే ఇష్టం. కూచిపూడి నేర్చుకున్నా. తర్వాత వెస్ట్రన్ డాన్స్, హిపాప్ కూడా నేర్చుకున్నా. ఇంటర్ చదువున్నప్పుడే డాన్స్ క్లాసులు చెప్పేదాన్ని. చాలామందిని నా చేతులతో డాన్సర్లను చేశాను. ఆ డాన్సింగ్ టాలెంట్ వల్లే పాత్రలు వాటంతట అవే నా దగ్గరకొచ్చాయి. మొదట్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘హార్ట్ ఎటాక్’... తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశాలొస్తున్నాయి. నటనపై మొదట్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా... పరిస్థితుల్ని బట్టి నా జీవితం ఇదే అనిపించింది. అందుకే ప్రొసీడ్ అవుతున్నా.

 సరే... వర్మ కంట్లో ఎలా పడ్డారు?
 ఏదో సందర్భంలో నా ఫొటో చూశారాయన. వెంటనే... మోహన్‌బాబుగారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ‘విష్ణు పక్కన హీరోయిన్‌గా చేస్తారా?’ అని. నేను షాక్. వెళ్లి వర్మగారిని కలిశాను. వెంటనే నన్ను ‘ఓకే’ చేసేశారు. ఆ సినిమానే ‘12’. త్వరలో విడుదల కానుంది. ఆ సినిమాలో నేను విష్ణు భార్యగా నటించాను. అందులోని నా నటన నచ్చి వెంటనే ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి హీరోయిన్‌గా తీసుకున్నారు వర్మ. ‘12’లో నవదీప్ కూడా చేశారు. ఆయన్ను కూడా ఆ సినిమా ద్వారానే హీరోగా ఎంపిక చేసుకున్నారు.

 అసలు ‘ఐస్‌క్రీమ్’ క్రీమేంటి?
 ఇదొక హారర్ థ్రిల్లర్. ఓ ఇంట్లో ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికీ ఎదురైన అనుభవాలే ఈ సినిమా. సాధారణంగా అమ్మాయిలకు ‘ఐస్‌క్రీమ్’ అంటే ఇష్టం. అలాగే ఈ సినిమాలో నాకు ‘ఐస్‌క్రీమ్’ ఇష్టం.
 అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. వర్మ హారర్ మిస్టరీల్లో ఇది ఓ సంచలనం అవుతుంది. ఇంతకీ... భయపెట్టేది దెయ్యమా? లేక మనుషులేనా? అనేది తెరపైనే చూడాలి.

 అవకాశాలు ఎలా ఉన్నాయి?
 ఓంకార్ తమ్ముడు హీరోగా రూపొందుతోన్న ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాలో చేస్తున్నా. అలాగే... ‘హోలీ’ అనే తమిళ సినిమాకు ఇటీవలే సైన్ చేశా. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రంలో నాది కీలక పాత్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement