Siddanthi
-
సిద్ధాంతి కిడ్నాప్ నిడదవోలులో కలకలం
నిడదవోలు : నిడదవోలు పట్టణం చిన కాశిరేవు సమీపంలో నివాసముంటున్న ప్రముఖ సిద్ధాంతి ప్రక్కి వీరభద్రరావు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సిద్ధాంతి ఇంటికి టాటా సుమోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చారు. ఇంటిలో స్నానానికి ఉపక్రమిస్తున్న వీరభద్రరావును అటకాయించారు. ఆయన సెల్‌ఫోన్ తీసుకుని స్విచ్ఆఫ్ చేశారు. విజయవాడ ఇంటిలిజెన్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీతో పనిఉందని, విజయవాడ ఇంటిలిజెన్స్ అధికారి రమ్మంటున్నారని చెప్పారు. ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అలవాటు ఉన్న ఆయనను తీసుకువెళ్ళడంతో భార్యకు అనుమానం వచ్చింది. స్నానం కూడా చేయనివ్వకుండా ఎందుకు తీసుకువెళుతున్నారని భార్య సూర్యకుమారి వారిని ప్రశ్నించగా సాయంత్రానికి తిరిగి పంపించేస్తామని చెప్పారు. మెయిన్ రోడ్డుకు 100 అడుగుల దూరంలో ఉన్న ఇంటి నుండి వీరభద్రరావును నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. రోడ్డుపైకి రాగానే టాటా సుమోలో తీసుకువెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుండి సిద్ధాంతి బయటకు వెళ్ళిన పది నిమిషాలకు భార్య ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ చేసి ఉండటంతో ఏం జరిగింది... ఎక్కడకు తీసుకుని వెళ్ళారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాంతికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బెంగళూరు, హైద్రాబాద్‌లో ఉంటున్నారు. కిడ్నాప్ సమయంలో ఇంటిలో వీరభద్రరావుతో పాటు భార్య ఒక్కరే ఉన్నారు. నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేసిన వీరభద్రరావు జ్యోతిష్యం, జాతకాలు చెప్పడంలో మంచి పేరు సంపాదించారు. ఆయన చెప్పింది చాలా వరకు జరుగుతుందని కొందరి నమ్మకం. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు ప్రతీ ఏటా ఆయన ఇంటికి వచ్చి జాతకాలు, జ్యోతిష్యం చెప్పించుకుంటారు. అసలు ఏం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణలు తమ సిబ్బందితో వీరభద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య సూర్యకుమారి నుంచి వివరాలు సేకరించారు. పట్టణంలో వివిధ సెంటర్ల ద్వారా తెల్లవారు జాము నుండి వాహనాల రాకపోకలను సీసీ పుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు. రెండు టాటా సుమో వాహనాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధాంతి ఇంటి చుట్టు పక్కల ఉన్న షాపుల యజమానులను ఆరా తీస్తున్నారు. పట్టణంలో ఉన్న లాడ్జీలలో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. భార్య సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పట్టణ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌పై భిన్న కథనాలు : నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్థాంతి వీరభద్రరావు కిడ్నాప్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ సమాచారంతో పట్టణంలో కలకలం రేగింది. అసలు సిద్ధాంతిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, అసలు అంత అవసరం ఎవరికి ఉందనేది చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయవాడ టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధాంతి వీరభద్రరావు నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు. సిద్ధాంతిగా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరభద్రరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎంపీలు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. గతంలో డీజీపీ స్థాయి అధికారి కూడా యాగం చేయించుకున్నారు. ఎవరితో విరోధాలు కూడా లేని వీరభద్రరావును కీలకమైన అంశంలో టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయనను హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
సూపర్ సర్వీస్
కరెంటు బిల్లు క ట్టాలి... సరుకులు తేవాలి... ఫ్రెండ్ బర్త్‌డేకి గిఫ్ట్ కొనాలి... అన్నీపెండింగ్ జాబితాలోనే... సిటీజనుల గజి‘బిజీ’ జీవితంలో ఇది సర్వసాధారణం. ఈ పెండింగ్ పనులను పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగాడు సిటీ చిన్నోడు జతిన్ అగర్వాల్. అనుకున్నదే తడవు.. అన్నీ వుుంగిట్లో ప్రత్యక్షవుయ్యే విధంగా ‘సూపర్వ్యూన్ సర్వీసెస్’ను ప్రారంభించాడు. పువ్వులు, సరకులు, డాక్యుమెంట్లు, గిఫ్ట్స్, చిల్లీ చికెన్, పిజ్జా.. ఏది కావాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో డెలివరీ చేసేస్తుంది జతిన్ బృందం. అదీ పర్యావరణానికి హాని చేయుని విధంగా... సైకిళ్లతో పాటు మెట్రో సర్వీస్ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారానే అందిస్తారు. ‘ఒక్క కాల్ చేస్తే చాలు.. వేగంగా, సురక్షితంగా మీక్కావల్సిన సరుకులు మీ ఇంటికి అందజేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించడంలో వూ వంతు పాత్రగా ఇలా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు, సైకిళ్లనే ఉపయోగిస్తున్నాం’ అంటున్నాడు జతిన్. ఈ రకంగా డోర్ డెలివరీ చేసే సంస్థ భారతదేశంలోనే ఇది మొదటిదట. ఈ సర్వీస్‌కు చార్జ్ రూ. 99 నుంచి రూ.999. - సిద్ధాంతి -
ఆన్లైన్లో హాట్‌బ్రాండ్
జ్యూట్ బ్యాగులపై ఆమె ఆర్ట్.. ఫ్యాషన్ ఐకాన్.. సెల్‌ఫోన్‌పై ఆమె సృజన.. నయూ ట్రెండ్... హైదరాబాద్ యుూత్ నుంచి ఆన్లైన్ దిగ్గజసంస్థ అమెజాన్ వరకు అందరూ ఆమె ఖాతాదారులే.. ‘సర్గా’ పేరుతో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఆమె పేరు కోవుల్ గోరుుల్.. హ్యూవున్ రిసోర్సెస్‌లో పీజీ చేసిన కోవుల్ ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపకుండానే తన వూర్కెట్ను విస్తరించుకుంటోంది. సోషల్ మీడియూ ద్వారా తన బ్రాండ్‌కు వ్యాల్యూ పెంచుకుంటోంది. సంప్రదాయ జ్యూట్‌బ్యాగులు, సెల్ఫోన్లపై కార్టూన్లు, పేర్లు, చిట్టిబొవ్ములను చిత్రించి వాటిని సరికొత్తగా రూపొందించడం కోవుల్ ప్రత్యేకత. ఒకప్పుడు హాబీగా మొదలెట్టిన ఈ కళే ఇప్పుడు ఆమెను బిజినెస్ ఐకాన్‌గా నిలబెట్టింది. సర్గా ఉత్పత్తుల ధర రూ.300 నుంచి రూ.800 లోపే. ట్రెండ్‌కు తగ్గట్టుగా, యుూత్కు నచ్చే విధంగా కోవుల్ తన వస్తువులకు నిత్యం కొత్తదనాన్ని జోడిస్తుంటారు. సోషల్ మీడియూ ద్వారా తన బిజినెస్ వురింతగా పుంజుకోవడం తనకెంతో సంతృప్తినిస్తున్నట్లు కోవుల్ పేర్కొంది. - సిద్ధాంతి -
మిడ్ రింగ్స్
సిటీలో అమ్మాయిల వేళ్లు ఇప్పుడు కీబోర్డ్ మీద, స్మార్ట్ఫోన్ల టచ్ స్క్రీన్ల మీద రోజూ గంటల కొద్దీ జామ్ అయి ఉంటున్నాయి. ఫలితంగా ఎక్కువసేపు నలుగురి దృష్టిలో పడుతున్నాయ్. దాంతో ఆ వేళ్ల అందాల్ని సైతం మెరిపించుకోవడానికి అమ్మాయిలు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఆ కోవలోనే మిడ్ ఫింగర్ రింగ్స్‌ను కనిపెట్టారు. ఉంగరపు వేలికి మాత్రమే ఉన్న దర్జాకు గండికొట్టారు. టిప్స్... మిడ్ రింగ్స్‌ను.. వేసుకున్న నెయిల్పాలిష్కు తగ్గట్టుగా ఎంచుకోండి రంగులద్దిన గోళ్లు, మిడ్ రింగ్స్... ఫుల్ స్లీవ్స్‌కు సరిగ్గా నప్పుతాయి గోల్డెన్, సిల్వర్... తదితర రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ మిడ్ఫింగర్ రింగ్స్ ఇప్పుడు అమ్మాయిల వేళ్ల కదలికలకు అనుగుణంగా నాట్యం చేస్తూ తమ స్టేటస్‌ను స్పీడ్‌గా పెంచుకుంటున్నాయి. రియానా, సారా, జెస్సికా పార్కర్, జెన్నిఫర్ లారెన్స్... వంటి పాప్స్టార్స్ ఈ ట్రెండ్‌కు ఆద్యులు కాగా... ఇప్పుడది కాలేజీ అమ్మాయిల ‘చేతి’లోకి వచ్చేసింది. సిటీలో ఉన్న ఫరెవర్ 21, ఆల్డో... వంటి ఫ్యాషన్ యాక్సెసరీస్ షోరూమ్స్‌లో బోలెడన్ని వెరైటీలు లభిస్తున్నాయి. వేలి కొసన ధరించేందుకు వీలుగానూ కొన్ని ఉన్నాయి. ఈ మధ్యవేలి మెరుపుల్ని మన సొంతం చేసుకోవాలంటే రూ. 500 నుంచి రూ.1000 లోపు ఖర్చు చేయాల్సిందే. ఈ కొత్త ట్రెండ్ ప్రకారం...యాక్సెసరీస్ అంటే మెడకు, చెవులకు మాత్రమే అనుకునే రోజుల్ని తిరగరాస్తూ వేలికి కూడా అని మార్చుకోవాలిక. - సిద్ధాంతి -
ఫ్యాషన్.. ఫ్లోరల్
డెనిమ్ జీన్స్. ఆ పేరే చాలు... యూత్ చేత ‘హమ్’ చేయించడానికి. ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వెల్లువెత్తినా... డెనిమ్ అంటే ఎవర్గ్రీన్. తరాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకోవడానికి ఈ జీన్స్‌కు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్లను జత చేసుకోవడమే. అందులో భాగంగానే ఇప్పుడు డెనిమ్ ‘స్ట్రైప్స్’తో అలంకరించుకుని సరికొత్త లుక్‌తో మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ‘నిజానికి ఈ స్ట్రైప్స్ జీన్స్ పాత ఫ్యాషనే. 1970 ప్రాంతంలోని సినిమాల్లో కూడా మనకీ స్టైల్ కనిపిస్తుంది’ అని సిటీ డిజైనర్ ఒకరు చె ప్పారు. ఏదేమైతేనేం... ఇప్పుడు సిటీలోని ఏ కాలేజ్ క్యాంపస్ చూసినా, కలర్‌ఫుల్ స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్, ఫ్లోరల్ డెనిమ్స్‌తో కళకళలాడుతోంది. ‘‘లైట్ బ్లూ, పింక్, ఆరెంజ్, లెమన్ ఎల్లో... వంటి కలర్స్‌లో ఉన్న ఫ్లోరల్ జీన్స్ ఇప్పుడు మా కాలేజ్‌లో ప్రతి అమ్మాయికి ఫేవరెట్స్’’ అని సెయింట్ ఆన్స్ కాలేజ్ గాళ్ చైతు చెప్పింది. వీటి ధరలు కూడా వందల్లోనే ఉండడంతో యూత్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి. స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్ కోసం సిటీలో ఓ 2 ప్లేస్‌లు... ఒకటి... వెస్ట్‌సైడ్. రెండు... మ్యాక్స్ అండ్ మ్యాంగో. డిజైనర్ టిప్స్ ఇవి డే టైమ్‌లో మాత్రమే ధరించడానికి బావుంటాయి కాలేజ్ అమ్మాయిలు బట్టర్ఫ్లై ప్రింట్స్, స్టార్స్, టెక్స్ట్, జీబ్రా ప్రింట్స్ నుంచి ఎంచుకోవచ్చు నెట్ టాప్స్‌ను ఫ్లోరల్ ప్రింట్స్‌కు కాంబినేషన్‌గా మారిస్తే అదుర్స్ కాంట్రాస్ట్ కలర్స్‌ను వాడడం బెటర్ బ్రైట్ టాప్, లైట్ బాటమ్స్‌కు రెయిన్బో బెల్ట్‌ను కలిపితే లుక్ సూపర్బ్ - సిద్ధాంతి -
హాట్ ఐస్‌క్రీమ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌బాబు ముద్దుపెట్టేస్తా అంటే భయపడి పారిపోయిన పాత్రతో వెలుగులోకి వచ్చిందా సిటీబ్యూటీ. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై ‘హాట్’ టాపిక్. రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ చిత్రంలో న్యూడ్‌గా నటించానంటూ పబ్లిగ్గా అంగీకరించి సంచలనం రేపింది. నగరంలోని బేగంపేటలో సెయింట్‌ఫ్రాన్సిస్ కాలేజీలో చదివిన తేజస్వి... డ్యాన్స్ టీచర్‌గా కూడా సిటీలో చాలా మందికి తెలుసు. ఏదో సినిమాలో అడపాదడపా కనిపిస్తుందిలే అనుకుంటుంటే ఏకంగా రామ్‌గోపాల్‌వర్మ చిత్రంలో.. అదీ న్యూడ్‌గా నటించిందంటూ తెలియడంతో ఇది షాకింగ్ న్యూస్ అయింది. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ... వర్మతో పనిచేయడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని, ఆయన ఒక మాస్ట్రో అని కితాబిస్తోంది తేజస్వి. ఐస్‌క్రీమ్ అంటే మహా ఇష్టమంటున్న ఈ బ్యూటీ స్పెయిన్‌లో ఐస్‌క్రీమ్స్ భలే రుచిగా ఉంటాయంది. సినీ పరిశ్రమ తనకు ఎంతో నచ్చిందంటోంది. ఫైనల్‌గా తనకు సంబంధించి వచ్చే రూమర్లపై ఎలా స్పందిస్తావంటే... ‘‘బాగా కష్టపడడం, మన అంతరంగం చెప్పినదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లిపోవడం అంతే’’ అని తేల్చేసింది. - సిద్ధాంతి