ఫ్యాషన్.. ఫ్లోరల్ | Fashion floral jeans for youth trend | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్.. ఫ్లోరల్

Published Wed, Jul 16 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

ఫ్యాషన్.. ఫ్లోరల్

ఫ్యాషన్.. ఫ్లోరల్

డెనిమ్ జీన్స్. ఆ పేరే చాలు... యూత్ చేత ‘హమ్’ చేయించడానికి. ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వెల్లువెత్తినా... డెనిమ్ అంటే ఎవర్‌గ్రీన్.  తరాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకోవడానికి ఈ జీన్స్‌కు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్లను జత చేసుకోవడమే. అందులో భాగంగానే ఇప్పుడు డెనిమ్ ‘స్ట్రైప్స్’తో అలంకరించుకుని సరికొత్త లుక్‌తో మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ‘నిజానికి ఈ స్ట్రైప్స్ జీన్స్ పాత ఫ్యాషనే. 1970 ప్రాంతంలోని సినిమాల్లో కూడా మనకీ స్టైల్ కనిపిస్తుంది’ అని సిటీ డిజైనర్ ఒకరు చె ప్పారు. ఏదేమైతేనేం... ఇప్పుడు సిటీలోని ఏ కాలేజ్ క్యాంపస్ చూసినా, కలర్‌ఫుల్ స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్, ఫ్లోరల్ డెనిమ్స్‌తో కళకళలాడుతోంది. ‘‘లైట్ బ్లూ, పింక్, ఆరెంజ్, లెమన్ ఎల్లో... వంటి కలర్స్‌లో ఉన్న ఫ్లోరల్ జీన్స్ ఇప్పుడు మా కాలేజ్‌లో ప్రతి అమ్మాయికి ఫేవరెట్స్’’ అని సెయింట్ ఆన్స్ కాలేజ్ గాళ్ చైతు చెప్పింది. వీటి ధరలు కూడా వందల్లోనే ఉండడంతో యూత్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
 
 స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్ కోసం సిటీలో ఓ 2 ప్లేస్‌లు...
 ఒకటి... వెస్ట్‌సైడ్. రెండు... మ్యాక్స్ అండ్ మ్యాంగో.
 
 డిజైనర్ టిప్స్

  ఇవి డే టైమ్‌లో మాత్రమే ధరించడానికి బావుంటాయి
  కాలేజ్ అమ్మాయిలు బట్టర్‌ఫ్లై ప్రింట్స్, స్టార్స్, టెక్స్ట్, జీబ్రా ప్రింట్స్ నుంచి
   ఎంచుకోవచ్చు
  నెట్ టాప్స్‌ను ఫ్లోరల్ ప్రింట్స్‌కు కాంబినేషన్‌గా మారిస్తే అదుర్స్
  కాంట్రాస్ట్ కలర్స్‌ను వాడడం బెటర్
  బ్రైట్ టాప్, లైట్ బాటమ్స్‌కు రెయిన్‌బో బెల్ట్‌ను కలిపితే లుక్ సూపర్బ్
 - సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement