Denim jeans
-
'విశ్వంభర' బ్యూటీ.. జీన్స్‌లో అందమే అసూయపడేలా! (ఫొటోలు)
-
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..!
లండన్: జీన్స్ ధరించే వారు ఒకట్రెండు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా వాటిని వాష్ చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం 18 ఏళ్లుగా తన రెండు జీన్స్ ప్యాంట్లను ఉతకలేదట. ఆపై అవి ఇంకా కొత్త వాటిలాగే ఉన్నాయని చెబుతోంది. కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయంటోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ యార్క్‌షైర్‌కు చెందిన ఈ మహిళ పేరు సాండ్రా విల్లిస్. 18 ఏళ్ల క్రితం ఓ జత ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొనుగులు చేసింది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే వాటిని ధరిస్తోందట. వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయాలనిపించడం లేదట. ఈమె సెంటు బాగా వాడటంతో జీన్స్ కూడా చెమట వాసన రావడం లేదట. ఇక ఎందుకు ఉతకడం అనుకుని వాటిని అలాగే ఉంచుతోంది. దీంతో ఆ జీన్స్ ప్యాంట్లు చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా ఉన్నాయని చెబుతోంది సాండ్రా. ఇంకో రెండేళ్లు కూడా వాటిని ఉతకనంటోంది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. జీన్స్ ప్యాంట్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుంటారా? నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు అంటున్నారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తూడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా వాటిని ఉతకాలని అన్పించినప్పుడు వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన వద్ద చాలా జతల జీన్స్ ఉన్నాయని, అందుకే వీటిని ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయన్నారు. చదవండి: వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి? -
అమ్మ బాబోయ్ ఇదేం యాపారం సామి..! జీన్స్ కొంటే ఫోన్ ఫ్రీ..టెక్ దిగ్గజం కొత్త ఐడియా
ఇటీవల కాలంలో ఆయా టెక్ సంస్థలు వేస్తున్న వ్యాపార ఎత్తు గడలు చిత్తవుతున్నాయి. నవ్వులు పూయిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ పాలిషింగ్ క్లాత్ అమ్మకానికి పెట్టి నెటిజన్ల చేతిలో అభాసుపాలైంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ 'మా జీన్స్ ప్యాంట్ కు రెండు జేబులంటూ' ప్రచారం చేయడంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. యాపిల్ కంటే శాంసంగ్ రెండాకులు ఎక్కువే సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్) ఫోన్లను విడుదల చేసింది.అయితే శాంసంగ్ ఆ మడత ఫోన్లసేల్స్ కోసం కొత్త బిజినెస్ ట్రిక్ ప్లే చేసింది. శాంసంగ్ ఆస్ట్రేలియాకు చెందిన 'డాక్టర్ డెనిమ్ జీన్స్' సంస్థతో ఒప్పొందం కుదుర్చుకుంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్‌ను పెట్టుకునేందుకు వీలుగా పరిమితంగా ఎడిషన్ జెడ్ ఫ్లిప్ పాకెట్ డెనిమ్ జీన్స్ ప్యాంట్‌ను విడుదల చేసింది. దీని ధర 1499 డాలర్లు (రూ.1,11,649.87) ఉండగా.. ఆ జీన్స్ ప్యాంట్‌ను కొనుగోలు చేసిన వారికి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 (ధర ఇండియాలో రూ.84,999.) ఫోన్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఈ జీన్స్ ప్యాంట్లు ఇండియాలో అందుబాటులో లేవు. కేవలం ఆస్ట్రేలియాలోని డెనిమ్ ఔట్లెట్లలో కొనుగోలు చేయొచ్చు' అని శాంసంగ్ తన ప్రకటనలో పేర్కొంది. Samsung has introduced jeans that received a special pocket for the Galaxy Z Flip3 folding smartphone. The jeans were released in collaboration with the Dr Denim brand. The unique pocket is located on the right hip and is designed specifically for the newest folding smartphone. pic.twitter.com/UBQn0rqAGY — Yaroslav Gavrilov (@appletester_rus) November 2, 2021 అంతే శాంసంగ్ చేసిన ఈ జీన్స్ ప్యాంట్ ప్రకటనపై నెటిజన్లు తమదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా జీన్స్ ప్యాంట్ వెనుక భాగంలో రెండు జేబులుంటాయి. వాటిని తొలగించి అదే జీన్స్ ప్యాంట్ ముందు భాగంలో మొకాళ్లపైకి కుట్టి అమ్మేస్తే సరిపోతుందా అంటూ ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు మొన్న యాపిల్ విడుదల చేసిన పాలిషింగ్ క్లాత్ ను గుర్తు చేసుకుంటూ..'యాపిల్ కంటే శాంసంగ్ రెండాకులు ఎక్కువే చదివినట్లుందే' నంటూ ట్విట్లతో రెచ్చిపోతున్నారు. Mom: We have an #Apple Polishing Cloth at home. pic.twitter.com/EKWZKeNYyv — Alex (@AlexRapada) October 26, 2021 యాపిల్ పాలిషింగ్ క్లాత్ గతనెలలో యాపిల్ సంస్థ ఆపిల్ లాంచ్ ఈవెంట్లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. పనిలో పనిగా ప్రెస్టేజ్ కు సింబల్ గా భావించి యాపిల్ ప్రొడక్ట్ లను కొనుగోలు చేసే వారికోసం కాస్ట్లీ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది. ఆ క్లాత్ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది. అంతే ఈ పాలిషింగ్ క్లాత్‌తో యాపిల్ కంపెనీపై దుమ్మెత్తిపోశారు. 'ఎస్ మా ఇంట్లో యాపిల్ పాలిషింగ్ క్లాత్' ఉందంటూ న్యాప్కిన్లో యాపిల్ లోగోను పెట్టి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండ్ టెక్ కంపెనీల కొత్త వ్యాపార పోకడతో నెటిజన్లకు మరింత ఫన్ దొరికిటన్లైంది. Got my NEW Apple Polishing Cloth!!! This thing is AMAZING!!! Haters will say it’s FAKE!! 🤣 pic.twitter.com/ZhDW0Mz5WS — Raul “PUCKY” Pacheco (@PuckyPacheco) October 20, 2021 చదవండి : టిమ్ కుక్ ను..ఎలన్ తిట్టినంత పనిచేస్తున్నారు?! -
స్టైల్ డెనిమ్.. 'జీన్'దాబాద్
జీన్స్.. ఈ శతాబ్ధంలోనే అత్యంత దీర్ఘకాలం పాటు నిలిచిన డ్రెస్ స్టైల్..ఏ షర్ట్ లేదా టీ–షర్ట్ లేదా కుర్తాతో సహా ఏదివేసుకున్నా మ్యచింగ్కిఅనువుగా మారిపోవడందీని స్పెషాలిటీ. దీనికి ప్రధాన కారణం కాలంతో పాటుమార్పుచేర్పులకూ అవకాశం ఉండటమే. ఎప్పటికప్పుడు టెక్నిక్స్ ఉపయోగించి ట్రెండీస్టైల్స్గా మార్చుకోగలగడమే. జీన్స్ ఒకటే.. స్టైల్స్ ఎన్నో.. అంటున్న యువత పాత కొత్త తేడా తెలియనివ్వని డెనిమ్ని చిన్న చిన్న మార్పులతో తామే స్టైలిష్‌గా ఎలామార్చుకోవచ్చు? సిటీకిచెందిన డూ ఇట్ యువర్ సెల్ఫ్ (డీఐవై) పేరిటనిపుణులు అందిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజులు వాడాక, కొత్త దనం కోల్పోయిన జీన్స్‌ని ఇంట్లో ఉన్న ట్వీజర్స్, శాండ్‌పేపర్, సిజర్స్, చీజ్‌లను ఉపయోగించి మరింత ట్రెండీగా, స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. దేనిని ఉపయోగించి ఏంమార్పు చేర్పులు చేసుకోవచ్చు అంటే.. ట్వీజర్స్ డెనీమ్ జీన్స్‌ని మోకాళ్ల వరకు సమానంగా కట్ చేసి, ఆ అంచులలో ట్వీజర్ సహయంతో నీలి దారాలను మాత్రమే తొలగించి, తెలుపు దారాలను అలాగే వదిలేయాలి. ప్యాంట్‌ని 2, 3 సార్లు వాష్ చేశాక ఆ అంచులకు సహజమైన ఫేడ్ లుక్ వస్తుంది. శాండ్‌పేపర్‡ మార్కెట్లో లభించే సాధారణ శాండ్‌పేపర్‌తో జీన్స్‌పైన సున్నితంగా పైపొర తొలిగేంత వరకు రుద్దాలి. క్షణాల్లో పాత జీన్స్‌కి కొత్త వాన్ లుక్ వస్తుంది. సిజర్స్ కత్తెరతో జీన్స్ అంచులను కట్ చేసి తరువాత వాటిని వాష్ చేస్తూ వదులుగా విడదీయాలి. తద్వారా లేటెస్ట్ స్టైల్‌ని యాడ్ చేసినట్టవుతుంది. ఛీజ్ æగ్రేటర్– పొట్టుతీయడానికి వంటింట్లో వాడే ఛీజ్ గ్రేటర్‌తో జీన్స్‌పైన అక్కడక్కడా ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం చీజ్ గ్రేటర్‌తో సున్నితమైన అంచులు వచ్చేంత వరకు రుద్దాలి. ఇది ఆకర్షణీయంగా ఉండి పార్టీ వేర్కి పనికొస్తుంది. ఎంబ్రాయిడరీ.. ఇంట్లో ఉండే సూదీ దారంతో మనకున్న జీన్స్‌ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఆకర్షణీయంగా ఉండే రంగు దారంతో రన్నింగ్ స్ట్రిచ్ లేదా చైన్ స్ట్రిచ్‌తో ఎంబ్రాయిడింగ్ చేసి ట్రెండీగా మార్చుకోవచ్చు. ఇందులోనే లావుగా ఉన్న దారంతో ప్యాకెట్స్ వద్ద, అంచుల్లో, సైడ్ లైనింగ్ వద్ద ఫాక్స్–సాడ్డల్ స్ట్రిచ్‌తో మరింత అందంగా మార్చుకోవచ్చు. మన్నికను పెంచే డై ప్యాచ్‌వర్క్.. జీన్స్ దుస్తుల మన్నికను పెంచుకోవడానికి ప్యాచ్‌వర్క్ మంచి టెక్నిక్. తొందరగా చిరిగిపోయేందుకు అవకాశం ఉన్న మోకాలు, ప్యాకెట్స్ వద్ద స్టైలీష్‌గా కత్తిరించిన పలు రకాల జీన్స్ ముక్కలను జత చేయడమే. ఇందులో ముందుగానే ప్యాంట్‌ని ఆ ప్రాంతాల్లో మార్క్ చేసుకుని కట్‌చేసి, లోపలి నుంచి ఈ ముక్కలను అదే రంగు దారంతో రన్నింగ్ స్ట్రిచ్ చేయాలి. దాని అంచులను రబ్ చేసి వదిలిస్తే మంచి లుక్‌తో పాటు ఫంకీ స్టైల్ వస్తుంది. ప్రస్తుతం ఇది ట్రావెలర్ ట్రెండ్. లేడీస్ జిన్స్కి మాత్రం బోహో–చిక్ జత చేస్తే ఆ డెనీమ్కి సరికొత్త లుక్ వస్తుంది. బ్యాడ్జెస్.. జీన్స్‌కి మరింత రఫ్ లుక్ కావాలనుకుంటే టోన్ జీన్స్‌కి బ్యాడ్జెస్ కలపాలి. ఈ బ్యాడ్జెస్తో గ్రంజీ మిలిటరీ లుక్, ప్రెప్పీ స్పోర్టీ లుక్‌తో వ్యక్తిగతమైన స్టైల్‌ని రూపొందించుకోవచ్చు. డూడుల్ ఆర్ట్.. ప్రస్తుతం బాగా నడుస్తున్న ట్రెండ్ ఇది. జీన్స్ వేసుకోవడాన్ని క్రేజీగా ఫీలవుతున్నారు. ఆక్రిలిక్ పేయింట్స్‌తో మామూలు జీన్స్‌ని డూడుల్ ఆర్ట్‌గా మార్చుకోవచ్చు. సమాంతర ప్రదేశంపైన ప్యాంట్‌ని ఉంచి ముందుగానే విభిన్న స్టైల్స్‌లో డూడుల్స్‌ని మార్క్ చేసుకోవాలి. అనంతరం ఆక్రిలిక్ పేయింట్స్‌ని వివిధ రకాల బ్రెష్‌లతో ఆ మార్క్స్ వద్ద అద్ది డ్రైయర్‌తో ఆరేంత వరకు ఉంచి వేసుకోవడమే. పేయింట్ స్ల్పట్టర్.. మరీ మరీ స్వేచ్ఛా పిపాసులు, ఫార్ములాకి కట్టుబడని వారు అయితే.. జీన్స్‌ను రెండు హుక్స్‌కు తగిలించి గోడకు వేలాడదీసి.. రంగులద్దుకున్న జీన్స్ మొత్తం రంగుల చుక్కలు పడేలా బ్రష్‌లతో చల్లాలి. స్టెన్సిల్ప్రింటింగ్.. జీన్స్ పైన ఇదొక ఫన్నీ, క్రేజీ స్టైల్.. చిన్నప్పుడు అక్షరాలను నేర్చుకునేటప్పుడు స్కూల్లో అందరం స్టెన్సిల్ పలకని (అక్షరాలు ముద్రించబడిన ఫ్రేమ్) వాడే ఉంటాం. ఇక్కడ అదే స్టెన్సిల్ పలకని ఉంచి నచ్చిన ప్యాటర్న్‌లో పేయింట్ చేసుకొని స్టైలీ లుక్ తేవడమే..! ట్విల్ టేప్స్..బీడ్స్.. ట్విల్ టేప్స్, బీడ్స్‌ను మన జీన్స్‌కు జతచేయడం కూడా కొత్త తరహా లుక్ అందిస్తుంది. ఇది హై ఫ్యాషన్ మేకోవర్ అనొచ్చు. జీన్స్ స్టిచ్ లైనింగ్ పైన ట్విల్ టేప్‌ని జతచేసి మరింత అందంగా కనిపించేందుకు స్టడ్స్, స్టైల్ పిన్స్‌ని అమర్చుకోవచ్చు. -
పార్టీ లేదా పని.. దేనికైనా ‘డెనిమ్’
న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్ అయినా.. డెనిమ్ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్ మార్కెట్ పరిమాణం మూడొంతులు పెరిగి రూ.21,993 కోట్లకు చేరుకుందని యూరో మానిటర్ అనే సంస్థ నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా 2018లో ఈ మార్కెట్ 14 శాతం వృద్ధి చెందింది. 2009 తర్వాత ఒక ఏడాదిలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం మళ్లీ ఇదే. గత కొన్నేళ్లుగా డెనిమ్ అమ్మకాలు ఏటా 9–11 శాతం స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన జరా, హెచ్అండ్ఎం, జాక్ అండ్ జోన్స్, గ్యాప్ గత దశాబ్దంలో మార్కెట్ వృద్ధికి తోడ్పడ్డాయి. యువతే ప్రోత్సాహకం ‘‘మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) కారణంగా పనిచేసే చోట సంస్కృతి మారిపోవడం, యువతకు డెనిమ్ ఏకరీతి వస్త్రధారణ కావడం ఈ సంస్కృతికి దారితీసింది. దీంతో ఇదొక మెగా ట్రెండ్‌గా మారింది’’ అని లెవిస్ ఇండియా ఎండీ సనీవ్ మొహంతి పేర్కొన్నారు. ఈ సంస్థ 2018–19లో అమ్మకాలను 25% పెంచుకుని రూ.1,104 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘ఫ్యాషన్ నుంచి డెనిమ్ ఎప్పటికీ బయటకు వెళ్లలేదు. ఇప్పుడు అవగాహన మరింత పెరిగింది. వేగంగా అమ్ముడుపోయే వాటికి బదులు విశ్వసనీయ బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ ఫ్యూచర్ రిటైల్ జాయింట్ ఎండీ రాకేశ్ బియానీ పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా తనకున్న రిటైల్ దుకాణాల పరిధిలో ఏటా కోటి వరకు జీన్స్‌ను విక్రయిస్తోంది. ఫార్మల్ వస్త్ర ధారణకు బదులు స్మార్ట్ క్యాజువల్స్ను ధరించే ధోరణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోందని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా బోటమ్‌వేర్ (నడుము కింద ధరించే వస్త్రాలు) విషయంలో డెనిమ్కు బలమైన డిమాండ్ ఉన్నట్టు స్పైకర్ సీఈవో సంజయ్ వఖారియా తెలిపారు. ఎంపికలెన్నో... మోనోక్రోమ్ డెనిమ్, అథ్లీష్యూర్ డెనిమ్, ఫ్లేర్డ్ డెనిమ్, హైవెయిస్ట్ ఫిట్, క్యారట్ఫిట్ నుంచి గతంలో నడిచిన క్లాసిక్ క్యాలిఫోర్నియన్ ఫిట్, మైనింగ్ జీన్స్ వరకు... వినియోగదారులకు జీన్స్ విషయంలో విస్తృతమైన శ్రేణి అందుబాటులో ఉండడం వారికి సౌకర్యంగానూ, ఈ మార్కెట్ వృద్ధికి ఊతంగానూ ఉంటోంది. డెనిమ్స్కు సంబంధించి రంగులు, ఫిట్టింగ్, డిజైన్లు, కొత్త స్టయిల్స్ విషయంలో కంపెనీలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొస్తున్నట్టు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్‌కుమార్ అన్నారు. ‘‘అప్పారెల్, లైఫ్‌స్టయిల్ విభాగంలో వినియోగం మందగించని విభాగాల్లో డెనిమ్ కూడా ఒకటి. ఈ ఏడాది కూడా దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంది’’ అని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ సీఈవో జే సురేష్ పేర్కొన్నారు. ఇతర విభాగాల్లో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. అన్ని బ్రాండ్లలోనూ డెనిమ్ వస్త్రాల అమ్మకాలు స్థిరంగా 10–15 శాతం మధ్య పెరుగుతున్నట్టు ఆయన చెప్పారు. -
డెనిమ్ అంబాసిడర్‌గా అనన్యపాండే
సాక్షి, చెన్నై: యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి, మోడల్ అనన్య పాండే వ్యవహరించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ – 2019 పేరిట కలెక్షన్లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు ఆ బ్రాండ్ సీఈఓ వినీత్ గౌతమ్ తెలిపారు. సోమవారం స్థానికంగా జరిగిన వేడుకలో యూరోపియన్ డెనిమ్ కలెక్షన్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ అంబాసిడర్‌ను ప్రకటించారు. యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ స్ప్రింగ్ సమ్మర్ –2019కు మాత్రమే అనన్య పాండే ప్రచారకర్తగా ఉంటారని, లిమిటెడ్ ఎడిషన్‌గా ఈనెల 17న తమ ఉత్పత్తులను ప్రవేశ పెట్టనున్నట్టు వివరించారు. -
ఫ్యాషన్.. ఫ్లోరల్
డెనిమ్ జీన్స్. ఆ పేరే చాలు... యూత్ చేత ‘హమ్’ చేయించడానికి. ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వెల్లువెత్తినా... డెనిమ్ అంటే ఎవర్గ్రీన్. తరాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకోవడానికి ఈ జీన్స్‌కు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్లను జత చేసుకోవడమే. అందులో భాగంగానే ఇప్పుడు డెనిమ్ ‘స్ట్రైప్స్’తో అలంకరించుకుని సరికొత్త లుక్‌తో మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ‘నిజానికి ఈ స్ట్రైప్స్ జీన్స్ పాత ఫ్యాషనే. 1970 ప్రాంతంలోని సినిమాల్లో కూడా మనకీ స్టైల్ కనిపిస్తుంది’ అని సిటీ డిజైనర్ ఒకరు చె ప్పారు. ఏదేమైతేనేం... ఇప్పుడు సిటీలోని ఏ కాలేజ్ క్యాంపస్ చూసినా, కలర్‌ఫుల్ స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్, ఫ్లోరల్ డెనిమ్స్‌తో కళకళలాడుతోంది. ‘‘లైట్ బ్లూ, పింక్, ఆరెంజ్, లెమన్ ఎల్లో... వంటి కలర్స్‌లో ఉన్న ఫ్లోరల్ జీన్స్ ఇప్పుడు మా కాలేజ్‌లో ప్రతి అమ్మాయికి ఫేవరెట్స్’’ అని సెయింట్ ఆన్స్ కాలేజ్ గాళ్ చైతు చెప్పింది. వీటి ధరలు కూడా వందల్లోనే ఉండడంతో యూత్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి. స్ట్రైప్స్, ప్రింటెడ్ జీన్స్ కోసం సిటీలో ఓ 2 ప్లేస్‌లు... ఒకటి... వెస్ట్‌సైడ్. రెండు... మ్యాక్స్ అండ్ మ్యాంగో. డిజైనర్ టిప్స్ ఇవి డే టైమ్‌లో మాత్రమే ధరించడానికి బావుంటాయి కాలేజ్ అమ్మాయిలు బట్టర్ఫ్లై ప్రింట్స్, స్టార్స్, టెక్స్ట్, జీబ్రా ప్రింట్స్ నుంచి ఎంచుకోవచ్చు నెట్ టాప్స్‌ను ఫ్లోరల్ ప్రింట్స్‌కు కాంబినేషన్‌గా మారిస్తే అదుర్స్ కాంట్రాస్ట్ కలర్స్‌ను వాడడం బెటర్ బ్రైట్ టాప్, లైట్ బాటమ్స్‌కు రెయిన్బో బెల్ట్‌ను కలిపితే లుక్ సూపర్బ్ - సిద్ధాంతి