సాక్షి, చెన్నై: యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి, మోడల్ అనన్య పాండే వ్యవహరించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ – 2019 పేరిట కలెక్షన్లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు ఆ బ్రాండ్ సీఈఓ వినీత్ గౌతమ్ తెలిపారు. సోమవారం స్థానికంగా జరిగిన వేడుకలో యూరోపియన్ డెనిమ్ కలెక్షన్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ అంబాసిడర్‌ను ప్రకటించారు. యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ స్ప్రింగ్ సమ్మర్ –2019కు మాత్రమే అనన్య పాండే ప్రచారకర్తగా ఉంటారని, లిమిటెడ్ ఎడిషన్‌గా ఈనెల 17న తమ ఉత్పత్తులను ప్రవేశ పెట్టనున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment