ఆహాలో సరికొత్త 'న్యూసెన్స్'.. టీజర్‌ చూశారా? | Aha web Series Newsense Teaser Released Today | Sakshi
Sakshi News home page

Newsense Teaser: 'రాస్తే రెండొందలే.. రాయకపోతే రెండువేలు'.. ఆసక్తిగా టీజర్

Published Tue, Mar 21 2023 9:45 PM | Last Updated on Tue, Mar 21 2023 9:57 PM

Aha web Series Newsense Teaser Released Today - Sakshi

నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ 'న్యూసెన్స్'. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్‌ హీరో రానా చేతులమీదుగా టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే పాలిటిక్స్, మీడియాను ఉద్దేశించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఎవడు మాట విన్నా, వినకపోయినా న్యూస్‌ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర' అన్న నవదీప్‌ డైలాగ్‌ ఆసక్తి పెంచుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీని వెల్లడించనున్నారు మేకర్స్. 'పాలిటిక్స్ ను ఆడించే పాళి.. మదనపల్లి రాజకీయాల్లో, కథాకళి.. పవర్‌పెన్ పాలిటిక్స్!' అనే క్యాప్షన్ ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement