మరింత పేరు తెచ్చుకుంటా..! | Navdeep Interview over Bham Bolenath | Sakshi
Sakshi News home page

మరింత పేరు తెచ్చుకుంటా..!

Published Wed, Feb 25 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

మరింత పేరు తెచ్చుకుంటా..!

మరింత పేరు తెచ్చుకుంటా..!

 ‘‘ఇప్పటి వరకూ నా స్థాయిలో నేను రాణిస్తున్నాననే అనుకుంటున్నా. అయితే ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం దక్కలేదనే వెలితి మాత్రం ఉంది. నా దగ్గరకు వచ్చినవాటిల్లో ఉత్తమమైనవే ఎంచుకుంటున్నా. భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అని నవదీప్ చెప్పారు. ఆయన హీరోగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో రాజేశ్‌వర్మ నిర్మించిన ‘భమ్ బోలేనాథ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ -‘‘భమ్ బోలేనాథ్’లో మూడు కథలుంటాయి.
 
 ఒకదానికొకటి సంబంధం లేనట్టు సాగినా ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి. ఆఖరుకు ఏం జరిగిందనేది ఆసక్తికరం. క్లైమాక్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన ఆంశాన్ని హాస్యభరితంగా నడిపించాం. తెలుగు సినిమాకు ఇది కొత్త తరహా క్లైమాక్స్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉందనీ, పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదనీ నవదీప్ పేర్కొన్నారు. తెలుగులో మూడు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement