టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు | Enforcement Directorate Notices To Tollywood Hero Navdeep | Sakshi
Sakshi News home page

Navdeep: సినీ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

Published Sat, Oct 7 2023 8:45 AM | Last Updated on Sat, Oct 7 2023 10:46 AM

Enforcement Directorate Notices To Tollywood Hero Navdeep - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో ఇటీవలే నవదీప్‌ను నార్కోటిక్‌ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. నార్కోటిక్‌ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.

(ఇదీ చదవండి: నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ )

అసలేం ఏం జరిగింది?

ఈ ఏడాది సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. ఇటీవలే అతడిని విచారించారు. 

(ఇది చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement