
నటుడు నవదీప్ విసుర్లు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనను సిట్ అధికారులు విచారించిన విధానంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని నటుడు నవదీప్ తప్పుబట్టారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు అమాయకులన్న భ్రమలో మీడియా ఉందని వ్యాఖ్యానించారు. తాము రాసిన కథనాలను ప్రజలు నమ్ముతారన్న విశ్వాసంతో ఉన్నట్టు కనబడుతోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై కనీసం గౌరవం లేనట్టుగా మీడియా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు కొనసాగుతుండగా ఊహాగానాలు, తమకు అందిన సమాచారం అంటూ ఇష్టానుసారం రాయడం సమంజసం కాదని నవదీప్ ట్వీట్ చేశారు.
కాగా, డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిన్న ఉదయం 10.30 నుంచి రాత్రి 9.50 వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి నవదీప్ నిరాకరించారు.
మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు విచారణ కొనసాగినట్టు ప్రతికా ప్రకటనలో సిట్ తెలిపింది. సౌరభ్ బానోతు, ఆకుల రితికేశ్, అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తులను కూడా ప్రశ్నించినట్టు సిట్ వెల్లడించింది. హీరోయిన్ చార్మి కౌర్ బుధవారం ఉదయం 10.30 గంటలకు హాజరవుతారని పేర్కొంది.
Its astonishing that certain mediums of news are assuming general public to be so ignorant and believe their amusing stories and (1/3)
— Navdeep (@pnavdeep26) 25 July 2017
twisted facts!
— Navdeep (@pnavdeep26) 25 July 2017
It seems like they have no respect for our government instutuions and on-going investigations which are being done in (2/3)
a very precise manner! #oohagaanalu#anisamacharam
— Navdeep (@pnavdeep26) 25 July 2017