
సాక్షి, హైదరాబాద్: మందు బాబుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. మద్యం మత్తులో నడుపుతున్న కారు సిగ్నల్‌ను జంప్ చేసి... ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతుల్లో గౌతమ్ దేవ్ (33) మృతి చెందగా, భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి బెంజ్ కారును నడుపుతున్నారు. ఆయనతో పాటు మిత్రుడు కౌశిక్ కూడా ఉన్నాడు. కాగా కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశీ విశ్వనాథ్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (హైదరాబాద్: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment