
సాక్షి, హైదరాబాద్: పాఠశాల, కళాశాలలో యోగా నేర్చుకొనేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హైకోర్టు జడ్జీ వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం నిర్మాణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. 2050 భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగథాన్‌లో 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్ నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయటాన్ని అలవాటుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేకమైన పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాదిమంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు.
నగరంలోని ప్రముఖ కళాశాలల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు గోల్డ్ ఛాలెంజ్ విభాగంలో 108 సార్లు, సిల్వర్ ఛాలెంజ్ విభాగంలో 54 సార్లు సూర్య నమస్కారాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment