మాదాపూర్‌లో డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఒకరి మృతి | Car Hits Bike At Madhapur 100 Feet Road Man Succumbed | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఒకరి మృతి

Oct 7 2020 12:24 PM | Updated on Oct 7 2020 1:13 PM

Car Hits Bike At Madhapur 100 Feet Road Man Succumbed - Sakshi

వేగంగా వెళ్తున్న కారు లైన్‌ క్రాస్‌ చేసి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని 100 ఫీట్‌ రోడ్డులో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లైన్‌ క్రాస్‌ చేసి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనకు సంబంధిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగానే కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియరాలేదు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
(చదవండి: యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement