ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్, బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామానికి చెందిన జొన్నల శ్రీను(17), చాట్ల రాంబాబు(24) మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన శివకృష్ణను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.