
కఠ్మాండు: మానస సరోవర యాత్రకు వెళ్లిన ముంబైకి చెందిన భక్తుడు మంగళవారం ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ వెనుక ఉండే ఫ్యాన్ రెక్క తగిలి నేపాల్‌లో మరణించారు. ఫ్యాన్ రెక్క తగలడంతో ఆయన తల తెగి ఘటన స్థలంలోనే చనిపోయారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.
హిల్సా ప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద ఉన్న హెలికాప్టర్‌ను ఎక్కేందుకు ఆయన వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుణ్ని కార్తీక్ నాగేంద్ర కుమార్ మెహతా (42)గా గుర్తించామనీ, సిమికోట్‌లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment