Indian pilgrims
-
‘కర్తార్‌పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కాడిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్‌పూర్ కారిడార్ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్‌పోర్ట్ తెచ్చుకోవాల్సిందేనని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్ అమలు చేయాలని కోరింది. కాగా, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూకు శనివారం జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది. -
నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి
కాట్మండు : నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్‌పుర్ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్ కుమార్ జెనా(52), చరణ్ బిషాల్ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. -
హెలికాప్టర్ రెక్క తగిలి..
కఠ్మాండు: మానస సరోవర యాత్రకు వెళ్లిన ముంబైకి చెందిన భక్తుడు మంగళవారం ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ వెనుక ఉండే ఫ్యాన్ రెక్క తగిలి నేపాల్‌లో మరణించారు. ఫ్యాన్ రెక్క తగలడంతో ఆయన తల తెగి ఘటన స్థలంలోనే చనిపోయారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. హిల్సా ప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద ఉన్న హెలికాప్టర్‌ను ఎక్కేందుకు ఆయన వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుణ్ని కార్తీక్ నాగేంద్ర కుమార్ మెహతా (42)గా గుర్తించామనీ, సిమికోట్‌లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. -
నేపాల్ బస్సు ప్రమాదంలో 12మంది భారతీయులు మృతి
ఖాట్మాండ్: నేపాల్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది భారతీయులు దుర్మరణం చెందారు. కొండప్రాంతంలో యాత్రికులతో వెళుతున్న ఈ బస్సు అదుపుతప్పి 100మీట్లర లోతు గల కొండ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయ తీర్థయాత్రికులు దుర్మరణం చెందగా, మరో 27మందికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికులతో వెళుతున్న బస్సులో మొత్తం 45మంది యాత్రికులు ఉన్నారు. యాత్రికులు ఖాట్మండ్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం తిరిగి గుజరాత్‌లోని గోరఖపూర్ ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన యాత్రికులు గుజరాత్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్
కఠ్మాండు: నేపాల్‌లో భారత యవతి గ్యాంగ్‌రేప్‌కు గురైంది. నేపాల్‌లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బిహార్ నుంచి వెళ్లిన 20 ఏళ్ల భారతీయ భక్తురాలిని మంగళవారం అక్కడి స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అక్కడే గస్తీలో ఉన్న పోలీసులు ఆ మహిళ అరుపులు విని, ఆమెను రక్షించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఏడుగురిని అక్కడికక్కడే అరెస్ట్ చేశామన్నారు. నేపాల్, భారత్‌ల నుంచి 25 లక్షల మంది భక్తులు ఐదేళ్లకోసారి జరిగే ఆ గాధిమాయి ఉత్సవానికి హాజరయ్యారు.