నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్ | Indian theft gang rape in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్

Published Thu, Dec 4 2014 2:37 AM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM

Indian theft gang rape in Nepal

కఠ్మాండు: నేపాల్‌లో భారత యవతి గ్యాంగ్‌రేప్‌కు గురైంది. నేపాల్‌లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బిహార్ నుంచి వెళ్లిన 20 ఏళ్ల భారతీయ భక్తురాలిని మంగళవారం అక్కడి స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అక్కడే గస్తీలో ఉన్న పోలీసులు ఆ మహిళ అరుపులు విని, ఆమెను రక్షించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఏడుగురిని అక్కడికక్కడే అరెస్ట్ చేశామన్నారు. నేపాల్, భారత్‌ల నుంచి 25 లక్షల మంది భక్తులు ఐదేళ్లకోసారి జరిగే ఆ గాధిమాయి ఉత్సవానికి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement