
సాక్షి,న్యూఢిల్లీ : కేరళకు చెందిన ప్రసిద్ధ కర్ణాటక, హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలో చికాగోలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. జయరాజ్‌కు భార్య, మేఘన, గౌరీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా కర్ణాకట సంగీతంలో 14 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన జయరాజ్ నారాయణన్ శాస్త్రీయ కళాకారుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శాస్త్రీయ,భక్తిగీతాలను పాడారు. కేరళలో పుట్టి పెరిగిన జయరాజ్ పలు ప్రపంచ వేదికలపై భారతీయ సంగీత గొప్పదనాన్ని చాటిచెప్పారు. అమెరికాలో క్లాసికల్, సెమిక్లాసికల్ అనేక కన్సర్ట్‌లు నిర్వహించారు. ఈ క్రమంలో చిన్న వయస్సులోనే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.