రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు వద్ద హౌవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు పాలమూరు 4 లేన్ల వంతెనపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికుడు ఒకరు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వోల్వో బస్- లారీ ఢీ: ఒకరి మృతి
Published Sat, Nov 28 2015 6:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
మృతుడు తిరుపతికి చెందిన శ్రీరామ్ ఆదిత్య(18) గా గుర్తించారు. శ్రీరామ్ విశాఖపట్నం గీతం కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రాడ్డు ఆదిత్య శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విజయనగరం నుంచి ఒంగోలుకు వెళుతోంది.
Advertisement
Advertisement